Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరూ ఆటగాళ్లు నోటికి పని చెప్పడంతో కాసేపు మాటల యుద్దం నడిచింది. చివరకు అంపైర్లు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సెంచరీది ఏం ఉందన్నా.. ఎలాగోలా మ్యాచ్ గెలిచాం: జోరూట్

సెంచరీది ఏం ఉందన్నా.. ఎలాగోలా మ్యాచ్ గెలిచాం: జోరూట్

అసలేం జరిగిందంటే..?

భారత ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని అయ్యర్ డిఫెండ్ చేయగా.. ఫాలో త్రూలో అందుకున్న సామ్ కరణ్ బంతితో రనౌట్ చేస్తున్నట్లు బెదిరించాడు. అంతటితో ఆగకుండా నోటికి పనిచెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన అయ్యర్.. ధీటుగా బదులిచ్చాడు. దాంతో అక్కడ చిన్నపాటి వాగ్వాదం చేసుకోగా.. అంపైర్లు జోక్యం చేసుకున్నారు.

Shreyas Iyer and Sam Curran Exchange Heated Words in India vs England 2nd ODI Video Goes Viral

ఇంగ్లండ్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(66 బంతుల్లో 8 ఫోర్లతో 65), శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ (30 బంతుల్లో 6 ఫోర్లతో 31), జస్‌ప్రీత్ బుమ్రా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(3/50), జోఫ్రా ఆర్చర్(3/47)లతో పాటు.. సకీబ్ మహ్మూద్(2/52) రెండు వికెట్లు తీసాడు. విల్ జాక్స్‌, సామ్ కరణ్ తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 19న హిట్ మ్యాన్ ఆఖరి వన్డే?

రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 19న హిట్ మ్యాన్ ఆఖరి వన్డే?

అనంతరం ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జో రూట్‌తో పాటు విల్ జాక్స్(44 బంతుల్లో 2 ఫోర్లతో 30), సామ్ కరణ్(31 బంతుల్లో 4 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్(2/67) రెండు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. చివరిదైన మూడో వన్డే ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Friday, July 17, 2026, 11:22 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+