ఇంకెక్కడి క్రికెట్.. మరో ఆరు నెలలు కష్టమే: సునీల్ గావస్కర్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా సమీప భవిష్యత్తులో క్రికెటే కాకుండా ఏ క్రీడా టోర్నీ కూడా జరిగే పరిస్థితి లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తెలిపాడు. ఈ ప్రాణాంతకం వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దు అయ్యాయి. టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యూరో 2020 వంటి ప్రధాన క్రీడా టోర్నమెంట్‌లు కూడా వాయిదాపడ్డాయి.

ఐపీఎలే కాదు..
ఇక భారత్‌లో మే 3వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై కూడా తీవ్ర సందిగ్ధత ఏర్పడింది.
ఐపీఎల్ మాత్రమే కాదు.. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికీ పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరో ఆరు నెలల పాటు.. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.

అది చాలా ప్రమాదం..
తాజాగా ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. ‘వివిధ క్రీడా సమాఖ్యల అధికారులు ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికడానికి తలలు బద్దలుకొట్టుకుంటున్నారు. వాళ్లు చాలా తెలివిగా ఆలోచించిన ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కష్టాంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరో 6 నెలల వరకూ కొనసాగేలా ఉన్నాయి. ఈ మధ్యలో ఏ టోర్నమెంట్ అయినా నిర్వహిస్తే.. అది ఆటగాళ్లతో పాటు.. అభిమానులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది' అని గావస్కర్ అన్నారు.
ప్రధాని మోదీని ప్రశంసించిన పాక్ మాజీ పేసర్

వ్యాక్సిన్ వస్తేనే..
సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరో 6 నెలల సమయం పడుతుందని ఈ భారత మాజీ కెప్టెన్ తెలిపాడు. ఆ తర్వాత మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా జరిగే అవకాశం ఉందని, అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చాకే పూర్తి స్థాయి టోర్నీలు జరుగుతాయన్నాడు.
‘వ్యాక్సిన్‌ను కనుగొనడమే కరోనాకు పూర్తి పరిష్కారంగా కనిపిస్తున్నది. త్వరగా వ్యాక్సిన్‌ను తీసుకొస్తే.. ఈ ఏడాది చివర్లో కల్లా ప్రేక్షకులు స్టేడియాల్లో కూర్చొని మ్యాచ్ చూసే అవకాశముంటుంది.' అని గావస్కర్ చెప్పాడు. అలాగే ఆటగాళ్లందరూ ప్రేక్షకుల సమక్షంలోనే ఆడాలని కోరుకుంటారని తెలిపాడు.
6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే.?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications