Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం దిక్కుమాలిన షెడ్యూల్.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!

బీసీసీఐపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. రంజీ ట్రోఫీ సమయంలో భారత్-ఏ సిరీస్‌లను షెడ్యూల్ చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు.

ఈ విధానం వల్ల దేశవాళీ టోర్నీ ప్రాధాన్యతను బీసీసీఐ స్వయంగా తగ్గిస్తోందని ఘాటుగా విమర్శించాడు. ఈ అనాలోచిత భారత్-ఏ షెడ్యూల్ కారణంగా కీలక ఆటగాళ్లు ఆయా రాష్ట్రాల రంజీ టీమ్‌లకు దూరమయ్యారని గవాస్కర్ మండిపడ్డాడు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

కీలక ఆటగాళ్లు దూరమైతే..

ఇటీవలే ఆస్ట్రేలియా 'ఏ'తో జరిగిన మూడు వన్డేల అనధికారిక సిరీస్‌లో పాల్గొన్న రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు తొలి రౌండ్ రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన గవాస్కర్.. అప్‌కమింగ్ న్యూజిలాండ్-ఏ పర్యటన కారణంగా మరికొంత మంది ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.

Sunil Gavaskar Raises Concerns Over India A Schedule Says Ranji Trophy Must Not Be Compromised

'రంజీ ట్రోఫీలో టాప్ క్లాస్ ఆటగాళ్ల గైర్హాజరీ కారణంగా దేశవాళీ క్రికెటర్ల నిజమైన సత్తాను అంచనా వేయడం కష్టంగా మారుతోంది. రంజీల్లో రాణించిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బంది పడటం మనం చూస్తున్నాం. నాణ్యమైన ఆటగాళ్లు లేకపోతే పోటీ బలహీన పడుతుంది. అప్పుడు సాధారణ బ్యాటర్ కూడా 2000 పరుగులు చేస్తాడు. బౌలర్ 100 వికెట్లు పడగొడుతారు.

అదే మా కొంపముంచింది: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్

Also Read

అదే మా కొంపముంచింది: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్

ఇప్పటికే టోర్నీ ప్రమాణాలు పడిపోయాయి..

అన్ని రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లేట్ డివిజన్‌ను చేర్చడం ద్వారా టోర్నీ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇండియా 'ఏ' మ్యాచ్‌లను దేశవాళీ రంజీ సీజన్‌కు అడ్డంకి లేకుండా నిర్వహించాలి. రంజీ ట్రోఫీకి బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.'అని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశాడు. ఈ వాదనకు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా మద్దతు పలికాడు.

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ కారణంగా భారత ప్రధాన ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి దూరంగా ఉండగా.. కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్ వంటి టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు బరిలోకి దిగారు.

Story first published: Monday, October 12, 2026, 18:43 [IST]
Other articles published on Oct 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+