Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెత్త కెప్టెన్సే భారత్ ఓటమికి కారణం: సునీల్ గవాస్కర్

టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే వెస్టిండీస్‌తో రెండో టీ20లో భారత్ ఓటమిపాలైందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల విషయంలో అయ్యర్ తప్పు చేశాడని విమర్శించాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను నిలదీస్తే అసలు విషయం తెలుస్తుందని చెప్పాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

బౌలింగ్ ప్రణాళికలే ఓటమికి కారణం..

ఈ మ్యాచ్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గవాస్కర్.. టీమిండియా బౌలింగ్ ప్రణాళికలను తప్పుబట్టాడు. ముఖ్యంగా 17వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్‌తో వేయించడం టీమిండియా ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డాడు. 'ఆ సమయంలో కుల్దీప్‌ యాదవ్‌కు బదులుగా మయాంక్ యాదవ్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌తో బౌలింగ్ చేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అప్పటికే మూడు వికెట్లు తీసి మంచి జోరు మీదున్న మయాంక్‌‌తో బౌలింగ్ చేయించి ఉంటే ఆశించిన ఫలితం దక్కేది.

Sunil Gavaskar Questions India s Bowling Decisions After West Indies Record Chase in 2nd T20I

అలాగే ఇన్నింగ్స్ ప్రారంభంలో శివమ్ దూబేకు 9వ ఓవర్‌లో బౌలింగ్ ఇవ్వడం కూడా టీమిండియాకు నష్టం చేసింది. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటున్న ఆ సమయంలో కుల్దీప్‌తో బౌలింగ్ చేయించాల్సింది. భారీ స్కోరు చేసినా బౌలింగ్ మార్పుల్లో జరిగిన పొరపాట్ల వల్లే భారత్ ఓటమిపాలైంది.

బౌలింగ్ కోచ్‌ను నిలదీయాలి..

ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల తప్పులేదు. భారత్ 235-240 పరుగులే చేస్తుందని అనుకున్నాను. కానీ భారత బ్యాటర్లు అదనంగా 9 పరుగులు జోడించారు. 249 పరుగులు డిఫెండ్ చేసుకోవాల్సిన స్కోర్. కానీ బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది.

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

Also Read

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

భారత బౌలింగ్ కోచ్‌ను బౌలింగ్ ప్రణాళికలపై నిలదీస్తేనే అసలు విషయం తెలుస్తుంది.'అని గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. పవర్ ప్లేలో అక్షర్ పటేల్‌తో బౌలింగ్ చేయడం కూడా టీమిండియాకు నష్టం చేసిందని మాజీ క్రికెటర్ వరున్ ఆరోన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, October 10, 2026, 16:54 [IST]
Other articles published on Oct 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+