ఈ పాపపు పాకిస్థాన్ జట్టు చేతిలో ఓడితే.. ఇంగ్లండ్‌కు అంతకన్నా సిగ్గు చేటు ఉండదు: స్టువర్ట్ బ్రాడ్
పాకిస్థాన్ టెస్ట్ టీమ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టు చేతిలో ఓడితే.. ఇంగ్లండ్‌కు అంతకన్నా సిగ్గు చేటు మరొకటి ఉండదన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఆ జట్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయాలను సీరియస్‌గా పరిగణించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది.

ఇందులో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను తప్పించింది. మైక్‌హెస్సేన్‌ను టెస్ట్ కోచ్‌గా నియమించింది. ఐదుగురు అనమాక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.
ఈ మార్పులపై ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్టువర్ట్ బ్రాడ్.. పీసీబీ తీరుపై విమర్శలు గుప్పించాడు. 'పాకిస్థాన్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబర్చారని సిరీస్ ఆరంభంలో విమర్శించినందుకు చింతిస్తున్నాను. అది వారి తప్పు కాదు. క్రికెట్ బోర్డులోని పరిపాలనా అవినీతి, సెలెక్షన్ కమిటీ అసమర్థత, కోచ్‌లను తరుచుగా మార్చడమే జట్టు దయనీయ స్థితికి కారణాలు.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ బలహీనమైన జట్టు అని, ఇంగ్లండ్ 3-0 తేడాతో గెలుస్తుందని నేను చెప్పినప్పుడు పాక్ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తే వారికి అసలు విషయం అర్థమవుతుంది. బర్మింగ్‌హామ్‌లో జరిగే ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ సునాయసంగా గెలవాలి. లేదంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు.'అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు. మూడో టెస్ట్ బర్మింగ్‌హామ్ వేదికగా సెప్టెంబర్ 9-13 మధ్య జరగనుంది. 2018 నుంచి సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పాకిస్థాన్ టెస్ట్‌ల్లో విజయం సాధించలేదు. మరోవైపు పీసీబీపై వచ్చిన విమర్శలను మోహ్‌సిన్ నఖ్వీ తిప్పికొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

