Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ రాజును కలవను.. పీసీబీపై తిరగబడ్డ పాక్ క్రికెటర్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ దేశ క్రికెటర్ తిరగబడ్డాడు. ఇంగ్లండ్ కింగ్ చార్లెస్‌ను కలవాలనే పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేశాడు. తనను జట్టు నుంచి అన్యాయంగా తప్పించారనే బాధతో ఇంగ్లండ్ కింగ్ చార్లెస్‌తో సమావేశాన్ని సదరు పాక్ ప్లేయర్ బాయ్‌కాట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. తోక ముడిచిన బాబర్ సేన!

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. తోక ముడిచిన బాబర్ సేన!

మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయింది. ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది.

Axed Pakistan Star Refuses Royal Meeting with King Charles of England in Protest Against PCB

పీసీబీ ఒత్తిడి చేసినా..

అయితే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ప్రతీ టెస్ట్ టీమ్ కింగ్ చార్లెస్‌ను కలవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టీమ్‌ కూడా క్లారెన్స్ హౌస్‌లో కింగ్ చార్లెస్‌ను కలిసింది. ఈ సమావేశానికి వేటుకు గురైన ఏడుగురు ఆటగాళ్ల కూడా హాజరుకావాలని పీసీబీ ఆదేశించింది. కానీ ఈ ఏడుగురులో ఒక ఆటగాడు పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆటగాడు ఎవరా? అనేది తెలియరాలేదు.

వేటుకు గురైన ఏడుగురు ఆటగాళ్లలో ముహమ్ అవైస్ జాఫర్, ఆమీర్ జమాల్, ఖుర్రమ్ షెహ్‌జాద్, అలి ఉస్మాన్.. కింగ్ చార్లెస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఆటగాళ్లు ఆసక్తి చూపించనప్పటికీ.. పీసీబీ ఒత్తిడితో పాల్గొన్నారు. కానీ ఏడో ఆటగాడు మాత్రం తమకు జరిగిన అన్యాయానికి నిరసనగానే కింగ్ చార్లెస్‌ను కలవలేదని బాహటంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి ఆటగాళ్లంతా తప్పకుండా హాజరు కావాలని పీసీబీ ఆదేశించింది.

రెండు క్యాచ్‌లు వదిలేసా కోచ్ పదవి ఇచ్చేస్తారా! పాక్‌పై సెటైర్లు!

Also Read

రెండు క్యాచ్‌లు వదిలేసా కోచ్ పదవి ఇచ్చేస్తారా! పాక్‌పై సెటైర్లు!

బ్యాట్ గిఫ్ట్..

ఈ సిరీస్‌లో పాకిస్థాన్ దారుణంగా విఫలమైనా.. ఆ జట్టు ఆటగాళ్లతో కింగ్ చార్లెస్ అప్యాయంగానే మాట్లాడారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లంతా సైన్ చేసిన బ్యాట్‌ను కెప్టెన్ బాబర్ ఆజామ్ కింగ్ చార్లెస్‌కు గిఫ్ట్‌గా అందజేశాడు. పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ కూడా బహుమతిని అందించారు.

బర్మింగ్‌హామ్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుండగా.. పాకిస్థాన్ గౌరవం కోసం పోటీ పడనుంది. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేయడం.. కోచ్ పదవి కోసం లింక్ట్‌ఇన్‌లో ప్రకటన ఇవ్వడం వంటి పనులతో ఇప్పటికే పాకిస్థాన్ నవ్వుల పాలవ్వగా.. తాజా వ్యవహారం మరో వివాదాన్ని రేకెత్తించింది.

Story first published: Thursday, September 3, 2026, 18:13 [IST]
Other articles published on Sep 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+