మైదానంలో గాయం డ్రామా.. పాక్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం!
పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్ చేయకుండా ఉండేందుకు గాయం డ్రామా ఆడాడనే ఆరోపణలు వచ్చాయి.
పిక్క గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్ చేయలేదు. రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో రెండో సెషన్ ముగిసిన వెంటనే మైదానం వీడిన ఇమామ్ ఉల్ హక్ మళ్లీ బరిలోకి దిగలేదు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ డకౌటయ్యాడు. అయితే అతని గాయంపై విచారణ జరుగుతుంది. అతను గాయం డ్రామా ఆడాడని తెలితే ఐసీసీ రూల్స్ ప్రకారం రెండేళ్ల వరకు నిషేధం విధించవచ్చని పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
ఇమామ్ ఉల్ హక్‌కు కొత్త కాదు..
ఇమామ్ ఫేక్ ఇంజ్యూరీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని జియో న్యూస్ తెలిపింది. అయితే ఇలా ఫేక్ ఇంజ్యూరీ డ్రామా ఆడటం ఇమామ్ ఉల్ హక్‌కు కొత్త కాదు. గతంలో కూడా అతను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. విచారణలో దోషిగా తేలితే ఐసీసీతో పాటు పీసీబీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

2025 న్యూజిలాండ్ పర్యటనలోనూ ఇమామ్ ఉల్ హక్ ఇలా చేశాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా ఇండోర్ నెట్ సెషన్‌లో ఇమామ్ కుడి కాలి బొటనవేలుకు గాయమైంది. అయితే ఈ గాయాన్ని దాచి వైద్య సిబ్బందిని తప్పుదోవ పట్టించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఏడుగురిపై వేటు..
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయింది. ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది.
మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్‌జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులు జట్టులోకి వచ్చారు. అదే సమయంలో టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా మైక్ హెస్సెన్, బౌలింగ్ కోచ్‌గా యాష్లే నోఫ్‌కేలను నియమించారు.
రిజ్వాన్ కెరీర్ ఖేల్ ఖతమ్..
పీసీబీ తాజా నిర్ణయంతో మహమ్మద్ రిజ్వాన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్ జట్టు తరఫున అతని కెరీర్ ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. మూడో టెస్ట్ బర్మింగ్‌హామ్ వేదికగా సెప్టెంబర్ 9-13 మధ్య జరగనుంది. 2018 నుంచి సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పాకిస్థాన్ టెస్ట్‌ల్లో విజయం సాధించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

