Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ షెడ్యూల్ విడుదల

Bangladesh announce schedule for one-off Test, T20I tri-series

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుతో పాటు జింబాబ్వేతో టీ20 ముక్కోణపు సిరిస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం ఆప్ఘనిస్థాన్ ఆగస్టు 30న అక్కడికి చేరుకుని రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?

ఆ తర్వాత ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 5 నుండి ఛటోగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతర ముక్కోణపు టీ20 సిరిస్ కోసం సెప్టెంబర్ 8న జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌కు రానుంది. ఈ షెడ్యూల్‌ని ఐసీసీ సైతం అధికారికంగా ప్రకటించింది.

ముక్కోణపు సిరిస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌లు మిర్‌పుర్‌లోని షేర్-ఈ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్‌లు ఛటోగ్రామ్‌లోనే జరగనున్నాయి. ఇక, సెప్టెంబర్ 24న జరగననున్న ఫైనల్ మ్యాచ్‌కి షేర్-ఈ-బంగ్లా నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

మరో 11 పరుగులు చేస్తే: లారా రికార్డుకి ఎసరు పెట్టిన క్రిస్ గేల్

కాగా, ఇటీవలే జింబాబ్వే జట్టుని ఐసీసీ ఈవెంట్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీలోని సభ్య దేశాలతో ద్వైపాక్షిక, ముక్కోణపు సిరిస్‌లు ఆడేందుకు మాత్రం అనుమతి ఉంది.

షెడ్యూల్ విడుదల చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు:

బంగ్లాదేశ్ Vs ఆప్ఘనిస్థాన్ ఏకైక టెస్టు: సెప్టెంబర్ 5-9, ఛటోగ్రామ్‌
బంగ్లాదేశ్ v జింబాబ్వే v ఆప్ఘనిస్థాన్ ముక్కోణపు టీ20 సిరిస్
బంగ్లాదేశ్ v జింబాబ్వే, 1st T20I, సెప్టెంబర్ 13
ఆఫ్ఘనిస్తాన్ వి జింబాబ్వే, 2nd T20I, సెప్టెంబర్ 14
బంగ్లాదేశ్ వి ఆఫ్ఘనిస్తాన్, 3rd T20I, సెప్టెంబర్ 15
బంగ్లాదేశ్ వి జింబాబ్వే, 4th T20I, సెప్టెంబర్ 18
ఆఫ్ఘనిస్తాన్ వి జింబాబ్వే, 5th T20I ఐ, సెప్టెంబర్ 20
బంగ్లాదేశ్ వి ఆఫ్ఘనిస్తాన్, 6th T20I, సెప్టెంబర్ 21

Story first published: Thursday, August 8, 2019, 16:13 [IST]
Other articles published on Aug 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+