పుజారాను వెనక్కి నెట్టిన స్మిత్: కోహ్లీ NO.1 ర్యాంకుకి ఎసరు!

హైదరాబాద్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టీమిండియా ప్లేయర్ పుజారాను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అంపైర్ జోయెల్ విల్సన్ 8 తప్పుడు నిర్ణయాలు.. చెత్త అంపైరింగ్ రికార్డు సమం
బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లాండ్ అభిమానులు తనను ఎగతాళి చేస్తున్నా... పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయి రెండు ఇన్నింగ్స్‌లోనూ 140కి పైగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో పోయిన పరువుని దక్కించుకోవడంతో పాటు ఆసీస్ జట్టులో తన స్థానానికి తిరుగులేదని నిరూపించుకున్నాడు. తొలి టెస్టులో రెండు సెంచరీలు సాధించడంతో స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 25 టెస్టు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు.

25వ టెస్టు సెంచరీ
ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం సర్ బ్రాడ్‌మన్ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 25వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో సైతం స్టీవ్ స్మిత్ తన స్థానాన్ని మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు 857 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న స్మిత్.. ప్రస్తుతం 900 పాయింట్ల సాధించి ఛతేశ్వర్ పుజారాను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు.
లార్డ్స్ టెస్టుకు జిమ్మీ దూరం: ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది

922 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో
ఈ జాబితాలో 922 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా... 913 పాయింట్లతో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ఇంగ్లాండ్ ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ గనుక ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకుకు ఎసరు పెట్టే అవకాశం ఉంది.

898 పాయింట్లతో తొలిసారి పాట్ కమ్మిన్స్
ఇక, బౌలింగ్‌లో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ 898 పాయింట్లతో తన కెరీర్‌లోనే తొలిసారి అగ్రస్థానంలో దక్కించుకున్నాడు. యాభై ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజాలు గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్ తర్వాత అత్యధిక పాయింట్ల సాధించిన మూడో ఆసీస్ బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డు సృష్టించాడు. ఇక, ఇంగ్లాండ్ బౌలర్లు బెన్ స్టోక్స్ 69వ స్థానంలో, క్రిస్ వోక్స్ 70వ స్థానంలో నిలిచారు.
యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

రోరీ బర్న్స్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి
ఇక, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 81వ స్థానంలో నిలిచాడు. ఇక, ఎడ్జిబాస్టన్ టెస్టుతో ఆస్ట్రేలియాపై 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టువర్ట్ బ్రాడ్ రెండు స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications