
హైదరాబాద్: ఎడ్జిబాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టు ఓటమిని మరిచిపోకముందే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు మరో ఊహించని షాక్ తగిలింది. తొలి టెస్టు మొదటి రోజు ఆట మధ్యలో కాలిపిక్క గాయంతో మైదానాన్ని అర్థాంతరంగా విడిచివెళ్లిపోయిన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో టెస్టుకి దూరం కానున్నాడు.
టీ20ల్లో అరుదైన రికార్డుకి చేరువలో శిఖర్ ధావన్!
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు ఆగస్టు 14వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సైతం అండర్సన్ దూరం కానున్నాడు. అండర్సన్ గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనుంది. దీంతో రెండో టెస్టు ఆండర్సన్ అందుబాటులో ఉండటం లేదని ఈసీబీ స్పష్టం చేసింది.
ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలి రోజు ఆండర్సన్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి కాలి పిక్క పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ తీయడం.. ప్రస్తుతం జేమ్స్ అండర్సన్ జట్టు పునరావస శిబిరంలో చికిత్స తీసుకుంటున్నాడు.
యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్
దీంతో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో జేమ్స్ అండర్సన్ స్థానంలో యువ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జోప్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌వుడ్ మొత్తం యాషెస్ సిరీస్‌కే దూరమయ్యాడు.
టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో మాజీ స్పిన్ మాంత్రికుడు
పక్కటెముకల నొప్పితో సతమతమవుతున్న మార్క్‌వుడ్ యాషెస్ నుంచి తప్పుకున్నాడు. కాగా, ఎడ్జిబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ 251 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన అండర్సన్ లేకపోవడం ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బౌలింగ్ విభాగంపై తీవ్ర ప్రభావం చూపింది.