రేయ్ ఎవర్రా మీరంతా.. SRH టైటిల్ గెలవాలని ఖైరతాబాద్ గణపతికి పూజలు! (వీడియో)
హైదరాబాద్‌లో డై హార్డ్ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైంది. అప్‌కమింగ్ ఐపీఎల్ 2027 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) విజేతగా నిలవాలని ఖైరతాబాద్ మహా గణపతికి కొందరు అభిమానులు పూజలు చేశారు. ఈ మేరకు చిట్టీ రాసి స్వామి పాదాల వద్ద ఉంచారు. ఆరెంజ్ ఆర్మీ టైటిల్ గెలిచి చాలా కాలమైందని, ఈ సారి గెలిచేలా చూడాలని మహా గణపతిని కోరుకున్నారు.
స్వామికి హారతి ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. దటీజ్ ఆరెంజ్ ఆర్మీ అని ఒకరంటే.. కావ్య పాప చూశావా? అభిమానుల ప్రేమ అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు సెటైరికల్‌గా 'రేయ్ ఎవర్రా మీరంతా' అని పోస్ట్‌లు పెడుతున్నారు.

ఐపీఎల్ 2016 డేవిడ్ వార్నర్ సారథ్యంలో తొలి సారి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 2018, 2014లో రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ చేరలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. గత 10 ఏళ్లుగా టైటిల్ కోసం ఆరెంజ్ ఆర్మీ నిరీక్షిస్తోంది.
ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌లోనైనా టైటిల్ గెలిచేలా చూడాలని ఖైరతాబాద్ మహా గణపతికి ఆరెంజ్ ఆర్మీ అభిమానులు పూజలు చేశారు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా పటిష్టంగా ఉంది. యువ బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు జట్టుకు ఉన్న బలహీనతలను అధిగమించేందుకు అవసరం లేని ఆటగాళ్లను ఆరెంజ్ ఆర్మీ వదిలేసే అవకాశం ఉంది. వచ్చే సీజన్ ప్యాట్ కమిన్స్ ఆడేది కూడా సందేహంగా మారింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సన్‌రైజర్స్ వ్యూహాలు సిద్దం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ తొలి వారంలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరిగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


