Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. SRH వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఊరించి ఊసురుమనిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆరెంజ్ ఆర్మీ.. కీలక ఎలిమినేటర్‌లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది. టైటిల్ అందుకోకపోయినా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల ప్రదర్శన జట్టు భవిష్యత్తుపై ఆశలను రేకెత్తించింది.

తృటిలో టైటిల్ అందుకునే అవకాశం కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ.. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి రావాలనే పట్టుదలతో ఉంది. తదుపరి సీజన్ కోసం జట్టును బలోపేతం చేయడంపై కావ్యమారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2027 మినీ వేలం ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ తొలి వారంలో జరిగే అవకాశం ఉండటంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ఐదుగురు ఆటగాళ్లను కచ్చితంగా వదిలేయనుంది.

5 Underperforming Sunrisers Hyderabad Players Who Could Be Released Before IPL 2027 Mini Auction


1. లియామ్ లివింగ్‌స్టోన్

జట్టుకు భారంగా మారిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయనుంది. ఐపీఎల్ 2026 మినీవేలంలో అన్‌సోల్డ్ దిశగా సాగిన లివింగ్ స్టోన్‌ చివరి నిమిషంలో ఆరెంజ్ ఆర్మీ రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతనికి తుది జట్టులో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. రెండు మ్యాచ్‌ల్లో అతనికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం దక్కినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మంచి ఓవర్‌సీస్ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.

2. జయదేవ్ ఉనాద్కత్

సీనియర్ పేసర్‌గా జట్టు బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తాడని ఆశించిన జయదేవ్ ఉనాద్కత్ తీవ్రంగా నిరాశపర్చాడు. పేలవ బౌలింగ్ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉనాద్కత్ 4 వికెట్లే తీసాడు. 10.91 ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతని స్థానంలో అవకాశం అందుకున్న యువ పేసర్లు సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే సత్తా చాటడంతో ఉనాద్కత్‌కు ఉద్వాసన తప్పలేదు. ఉనాద్కత్‌ను వదిలేస్తే రూ.1 కోటి రూపాయాలు సన్‌రైజర్స్ ఖాతాలో చేరనున్నాయి.

3. జీషన్ అన్సారీ

ఉత్తరప్రదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ జీషన్ అన్సారీ‌కి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. యువ స్పిన్నర్లు శివాంగ్ కుమార్, హర్ష్ దూబే సత్తా చాటడంతో జీషన్ అన్సారీ పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే జీషన్ అన్సారీని వదిలేసి బ్యాకప్‌గా యువ స్పిన్నర్‌ను ఎంచుకోవాలనే యోచనలో సన్‌రైజర్స్ యాజమాన్యం ఉంది.


4. హర్షల్ పటేల్

హర్షల్ పటేల్ ప్రదర్శనపై కూడా సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హర్షల్ పటేల్ 10.83 ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 11.48 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని తుది జట్టులో చోటు కోల్పోయాడు.

యువ పేసర్లు సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే అద్వితీయమైన ప్రదర్శనతో హర్షల్ పటేల్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే హర్షల్ పటేల్‌ను వదిలేసి.. మరో ఇండియన్ పేసర్‌ను కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. హర్షల్ పటేల్ నిష్క్రమణతో రూ.8 కోట్లు సన్‌రైజర్స్‌ పర్స్‌లో చేరుతాయి.

5. డేవిడ్ పేన్

ఆస్ట్రేలియా పేసర్ జాక్ ఎడ్వర్డ్స్‌కు ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన డేవిడ్ పేన్‌కు కూడా సన్‌రైజర్స్ గుడ్‌బై చెప్పనుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండు మ్యాచ్‌లే ఆడిన అతను.. ఆర్‌సీబీతో తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసాడు. కానీ కేకేర్‌తో మరుసటి మ్యాచ్‌లో తేలిపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో 35 పరుగుల చొప్పున సమర్పించుకొని తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత కాలి మడమ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2027 రిలీజ్ లిస్ట్‌లో డేవిడ్ పేన్ పేరు ముందు వరుసలో ఉండనుంది.

Story first published: Tuesday, August 4, 2026, 9:51 [IST]
Other articles published on Aug 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+