Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2027 సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అయిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్ బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కిక్కిరిసిన షెడ్యూల్‌తో బిజీగా ఉండనుంది.

వచ్చే 12 నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా 20 టెస్ట్‌లు, 14 వైట్‌బాల్ గేమ్స్ ఆడనుంది. జింబాబ్వే, సౌతాఫ్రికాతో 6 వన్డేలు, సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌లు, సొంగడ్డపై ఇంగ్లండ్‌తో 8 వైట్‌బాల్ గేమ్స్, న్యూజిలాండ్‌తో 4 హోమ్ టెస్ట్‌లు, భారత్ పర్యటనలో ఐదు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ 2027తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్దం కావాల్సి ఉంది.

Big forBlow SRH and RCB as Australia Players Could Miss IPL Duties Amid Packed Schedule

ఆసీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు..

ఈ క్రమంలోనే తమ స్టార్ ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నాడు. అయితే తమ ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో ఐపీఎల్ కూడా కీలక భాగమేనని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రదర్శనలను బ్యాలెన్స్ చేయడంలో ఐపీఎల్ ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డాడు.

'ప్రపంచ టోర్నీల దృష్ట్యా పేసర్లు తమ శరీరాన్ని ఫిట్‌గా మార్చుకునేందుకు ఐపీఎల్ ప్రణాళికలు సహాయపడుతాయి. భారత్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల మానసిక భారం, ఫిట్‌నెస్ స్థాయిలను బట్టి నిర్ణయాలు మారుతుంటాయి.

ఐపీఎల్ వల్ల నష్టం లేదు.. కానీ

ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లు విఫలమవుతున్నారనే వాదన సరికాదు. గతంలో ఇంగ్లండ్ గడ్డపై కామెరూన్ గ్రీన్ వైఫల్యానికి ఐపీఎల్‌ను ముడిపెట్టడం సరికాదు. ఫార్మాట్ల మార్పుల వల్ల ఆటగాళ్ల సవాళ్లు ఎదుర్కొంటారు. దాంతోనే అంతకుముందు జరిగిన టోర్నీలను నిందించడం సరికాదు. వచ్చే 12 నెలలు ఆస్ట్రేలియాకు కిక్కిరిసిన షెడ్యూల్ ఉంది. యాషెస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటంపై మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది.'అని మెక్‌డోనాల్డ్ తెలిపారు.

గత సీజన్‌లో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ వంటి స్టార్ పేసర్లు గాయాల కారణంగా ఐపీఎల్‌కు ఆలస్యంగా చేరుకోవడంపై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మెక్‌డొనాల్డ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Story first published: Saturday, August 8, 2026, 9:44 [IST]
Other articles published on Aug 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+