
సుశాంత్ మరణం కలిచివేసింది..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్న శ్రీశాంత్.. తాను కూడా ఆ క్లిష్ట దశ నుంచి అదృవశాత్తు బయటపడ్డానన్నాడు. ‘సుశాంత్ ఆత్మహత్య నన్న తీవ్రంగా వేధించింది. ఎందుకంటే అతను నాకు మంచి ఫ్రేండ్. అంతేకాకుండా నేను కూడా ఆ క్లిష్ట దశను అనుభవించా. ఆ కష్టం, బాధేంటో నాకు తెలుసు. దీనిపై ఓ బుక్ కూడా రాస్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే అది పూర్తవుతుంది. డిప్రెషన్‌తో నేను ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన తీరును ఇందులో వివరిస్తున్నా.
ఎందుకు ఎగిరిపడుతున్నారు.. జయవర్ధనే, సంగక్కరలను ప్రశ్నించిన లంక మాజీ మంత్రి

సూసైడ్ చేసుకోవాలనుకున్నా..
2013 ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టు ముట్టినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ఈ లోకం నుంచి వెళ్లిపోవడమే సులభమైన మార్గం అనుకున్నా. మరణం అంచుల దాకా వెళ్లా. కానీ, నా ఫ్యామిలీ గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకున్నా. ఒక దశలో నేను చీకటిని చూసి భయపడ్డా. డీప్ డిప్రెషన్‌లోకి వెళ్లా. కనీసం ఇంటి నుంచి కాలు బయట పెట్టలేకపోయా. ఎక్కడ తప్పు జరిగింది.. నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అని ఆలోచిస్తుండే వాడిని. ఆ టైమ్‌లో మా పేరెంట్స్‌కు కనిపించేప్పుడు ఒకలా.. గదిలో మరోలా రెండు రకాల జీవితాలు గడపడం చాలా కష్టంగా అనిపించేది.

నీతో నువ్వే మాట్లాడుకోవాలి..
నేను ఈ ప్రపంచానికి శ్రీశాంత్‌ను, మా ఫ్యామిలీకి గోపు.. కానీ నా రూమ్‌లో నేను ఏమిటో నాకు తెలిసేది కాదు. అందుకే కొత్త హాబీస్‌ను అలవాటు చేసుకున్నా. ఒంటరితనానికి, డిప్రెషన్‌కు మధ్య తేడా తెలియక ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతారు. మనం నిరాశలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడాలని చెబుతారు. కానీ, నేను మాత్రం నీతో నువ్వే మాట్లాడుకోవాలంటా. పుస్తకాలు చదవాలి. మన గురించి మనం తెలుసుకునే ప్రక్రియే అది. నేను వేదాలు, మలయాళ సాహిత్యం చదివి నాలెజ్జ్ పెంచుకునే ప్రయత్నం చేశా' అని శ్రీశాంత్ వివరించాడు.

టిమ్ గ్రోవర్ పర్యవేక్షణలో ట్రైనింగ్..
ఫిట్‌నెస్ నిరూపించుకుంటే రంజీ టీమ్‌లోకి తీసుకుంటామని కేరళ క్రికెట్ అసోసియేషన్ భరోసా ఇవ్వడంతో శ్రీశాంత్ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన శ్రీ... ప్రముఖ ఫిజికల్, మెంటల్ ట్రైనింగ్ కోచ్ టిమ్ గ్రోవర్ సాయం తీసుకుంటున్నాడు. అమెరికా బాస్కెట్‌బాల్ లెజెండ్స్ మైకేల్ జోర్డాన్, కోబి బ్రయాంట్ తదితరులకు శిక్షణ ఇచ్చిన గ్రోవర్ ఆన్‌లైన్ క్లాస్‌లు అటెండ్ కావడం కోసం ఉదయం 5 గంటలకే నిద్రలేస్తున్నట్టు చెప్పాడు. ‘ఎన్‌బీఏలో గ్రోవర్‌కు చాలా పేరుంది. వారానికి మూడు సార్లు ఉదయం 5.30 నుంచి 8.30 వరకు గ్రోవర్ ఆన్‌లైన్ క్లాస్‌లు అటెండ్ అవుతున్నా. ఆపై, మధ్యాహ్నం 1.30 నుంచి 6 గంటల వరకు ఎర్నాకుళం ఇండోర్ నెట్స్‌లో కేరళ అండర్- 23 ప్లేయర్స్, సచిన్ బేబీ లాంటి రంజీ ప్లేయర్లతో కలిసి ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నా. తొలి రెండు గంటల్లో రెడ్ బాల్‌తో, చివర్లో వైట్ బాల్‌తో రోజూ కనీసం 12 ఓవర్లు వేస్తున్నా. నా యాక్షన్ మునుపటిలానే ఉంది. ఔట్ స్వింగర్ రిలీజ్‌లో కూడా మార్పేమీ లేదు' అని శ్రీశాంత్ చెప్పాడు.


Click it and Unblock the Notifications

నాన్నకు ప్రేమతో అంటూ ఏమోషనల్ అయిన కోహ్లీ










