For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకు ఎగిరిపడుతున్నారు.. జయవర్ధనే, సంగక్కరలను ప్రశ్నించిన లంక మాజీ మంత్రి

vFormer Sri Lanka Sports Minister Mahindananda Aluthgamage backs his 2011 World Cup final match-fixing allegations

కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ వ్యవహారం లంకలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ ఆరోపించిన లంక మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే‌ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్‌ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కానీ మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

‘సర్కస్‌ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు ప్రస్తావించలేదు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు' అని మహిదానంద అన్నారు.

భారతీయులపై మండిపడిన పోర్న్‌ స్టార్‌గా మారిన మహిళా రేసర్‌!

అలా ఎలా?

అలా ఎలా?

మరోవైపు మహిదానంద వ్యాఖ్యలపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ను ఫిక్స్‌ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్‌ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి' అంటూ ఈ మాజీ కెప్టెన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇక ముంబై వేదికగా జరిగిన నాటి ఫైనల్లో జయవర్దనే(103) సెంచరీతో రాణించాడు.

విచారణకు ఆదేశం..

విచారణకు ఆదేశం..

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర లేదని, కొన్ని పార్టీలు పాలుపంచుకున్నాయని మహిదానంద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకునేందుకు లంక ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి దుల్లాస్‌ అలాహప్పెరుమా సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దర్యాప్తు ప్రగతిపై ప్రతి రెండు వారాలకొకసారి నివేదిక అందించాలని ఆదేశించారు.

చాలాసార్లు చావాలనుకున్నా.. తెలుసుంటే సుశాంత్‌తో మాట్లాడేవాడిని : షమీ

సర్కస్‌ మొదలైనట్లుంది..

సర్కస్‌ మొదలైనట్లుంది..

మహిదానంద చేసిన ఆరోపణలను లంక దిగ్గజ ఆటగాళ్లు మహేళ జయవర్ధనె, కుమార సంగక్కర ట్విటర్ వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. ఎన్నికల సర్కస్ మొదలైనట్లుందని, ఆధారాలు చూపించాలని జయవర్దనే వ్యంగ్యంగా ట్వీట్ చేయగా.. సాక్ష్యాధారాలను ఐసీసీకి అందజేయాలని సంగక్కర సూచించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సెహ్వాగ్‌ (0), సచిన్‌ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించింది. మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఈ మ్యాచ్ ఫలితంపై సందేహం వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, June 21, 2020, 10:17 [IST]
Other articles published on Jun 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+