For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్నకు ప్రేమతో అంటూ ఏమోషనల్ అయిన కోహ్లీ

Team India Captain Virat Kohli shares heartfelt post on Fathers Day 2020


న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కొహ్లీ ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగపు ట్వీట్‌ చేశాడు. తన తండ్రితో దిగిన ఫోటోను జత చేస్తూ.. ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల ప్రేమకు కృతజ్ఞతగా ఉండాలని, వారు చూపిన మార్గంలో నడువాలని పిలుపునిచ్చాడు. 'ఈ ఫాదర్స్ డే రోజున మిమ్మల్ని నేను ఒకటి కోరుతున్నా. అందరూ మీ తండ్రి చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతతో ఉండండి. ఆయన చూపిన మార్గంలో నడిస్తే మీరు ఎప్పటికీ వెనుకబడరు. ఎందుకంటే వారు ఈ లోకంలో ఉన్నా.. లేకున్నా ఎప్పుడూ మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటారు.' అని కొహ్లీ ట్వీట్‌ చేశాడు. కొహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006లో గుండెపోటుతో కన్నుమూశారు.

తండ్రి మరణ వార్త తెలిసి కూడా..

ఢిల్లీ- కర్ణాటక రంజీ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలోనే బ్రెయిన్‌స్ట్రోక్‌తో కోహ్లీ తండ్రి చనిపోయాడన్న సమాచారం అందింది. కీలక మ్యాచ్‌లో 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉంది. అప్పటికే కోహ్లీ ఓవర్‌నైట్‌ 40 స్కోరుతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని కోచ్‌ ముందు ప్రస్తావించగా అతను ఇంటికెళ్లమని సూచించాడు. అయినా అతడి భావోద్వేగాలు అదుపు తప్పలేదు. అప్పటికే అతని నరనరాల్లోకీ క్రికెట్‌ ఎక్కేసింది.

 ఆ రాత్రి నుంచే.. కొత్త కోహ్లీ

ఆ రాత్రి నుంచే.. కొత్త కోహ్లీ

దానికంటే ఏదీ ఎక్కువ కాదనే నిర్ణయానికి వచ్చేశాడు. కాదు... తండ్రే అతడికా విషయాన్ని నూరిపోశాడు. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని బ్యాటింగ్‌ కొనసాగించాలనీ, శతకం చేసి తండ్రికి అంకితమివ్వాలనీ నిర్ణయించుకున్నాడు. కానీ తొంబై పరుగుల వద్ద అంపైర్‌ తప్పిదం వల్ల అవుటైన విరాట్, శతకం చేయకపోయినా ఆ స్ఫూర్తికి తండ్రి సంతోషించే ఉంటాడన్న నమ్మకంతో నేరుగా అంత్యక్రియలకు బయల్దేరాడు. ఆ రాత్రి నుంచీ తామంతా ఓ కొత్త కోహ్లీని చూశామని విరాట్‌ తల్లి సరోజ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కోహ్లీ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి నుంచి గట్టెక్కింది. అంత్యక్రియలు పూర్తైన మరుసటిరోజే కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ పాల్గొన్నాడు.

 లంచం ఇవ్వనన్నాడు..

లంచం ఇవ్వనన్నాడు..

లాక్‌డౌన్ సమయంలో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీలో ఇన్‌స్టాలైవ్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లీ తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి తనకు సరైన మార్గం చూపారని తెలిపాడు. ఢిల్లీలో సెలక్షన్స్‌ అప్పుడు తనను జట్టులోకి ఎంపిక చేయాలంటే మెరిట్‌తోపాటు కొంత లంచం ఇవ్వాలని ఒకరు కోరగా, తన తండ్రి ఒప్పుకోలేదన్నాడు. మెరిట్‌ ఉంటేనే ఎంపిక చేసుకోండని, డబ్బులు ఇవ్వలేనని చెప్పాడని కొహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఈ ఘటన అప్పుడు తనను బాధకు గురిచేసినా.. మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చిందన్నాడు. తాను సెలక్ట్‌ కావాలంటే అసాధారణ ప్రతిభ ఉండాలని ఆనాడే నిశ్చయించుకుని, విజయం సాధించానని కొహ్లీ చెప్పుకొచ్చాడు. ఆవిధంగా తన తండ్రి సన్మార్గం చూపారని భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Sunday, June 21, 2020, 20:49 [IST]
Other articles published on Jun 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+