
నాకింకా గుర్తుంది..
‘నా వరకు 2011 ప్రపంచకప్ గెలిచిన రోజే భారత క్రికెట్ చరిత్రలో గొప్పదినం. ఆఖరి బంతికి ధోనీ కొట్టిన సిక్స్.. విజయాన్నందుకున్న ఆ అద్భుత క్షణం ఎన్నటికీ మరిచిపోలేనిది. నాటి అద్భుత క్షణాలు నాకింకా గుర్తున్నాయి. కామెంట్రీ బాక్స్‌లో నుంచి మైదానంలోకి వచ్చిన నేను ధోనీని, మైదానమంతా కలియ తిరిగిన ఆటగాళ్లను చూస్తూ నిలబడిపోయాను.
ధోనీ కెప్టెన్ కాకుండా ఆ స్థానంలో ఆడుంటే రికార్డులన్నీ బద్దలయ్యేవి: గంభీర్

నా వారుసులే..
2003 ప్రపచంకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కెప్టెన్‌గా ఓటమి ఎదురైన నాకు ధోనీ ప్రపంచకప్ గెలవడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రపంచకప్ గెలిచిన ఆ జట్టు ఏడు ఏనిమిది మంది ఆటగాళ్లు నా సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట‌్‌లో అరంగేట్రం చేశారు. సెహ్వాగ్, ధోనీ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా అందరూ నా వారసులే. వీరే ప్రపంచకప్ గెలవడం మరింత సంతోషాన్నిచ్చింది.'అని గంగూలీ తెలిపాడు.
కోహ్లీసేనకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లేదు: గంభీర్

చేజారిన కప్..
సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్‌లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి తృటిలో ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. ఆ టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న గంగూలీ సేన కీలక ఫైనల్లో తడబడింది. పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ చాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2007 ప్రపంచకప్‌లో దారుణ ఓటమి మూట గట్టుకున్న భారత జట్టు.. స్వదేశంలో 2011 ప్రపచంకప్ ముద్దాడి 28 ఏళ్ల కళను సాకారం చేసుకుంది. ఇక 2013 చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత్ మళ్లీ మరొక ఐసీసీ టైటిల్ గెలవలేదు.

పుట్‌బాల్‌లో బ్రెజిల్.. క్రికెట్‌లో భారత్..
ఫుట్‌బాల్ టోర్నీల్లో బ్రెజిల్‌లా క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుందని దాదా అభిప్రాయపడ్డాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా భారత్‌లో క్రికెట్ ఆడుతూ కనిపిస్తారని గుర్తుచేసిన గంగూలీ.. బ్రెజిల్‌లోనూ ఇలాంటి ఫుట్‌బాల్ వాతావరణమే కనిపిస్తుందని వెల్లడించాడు. దేశంలో ఇలాంటి క్రీడా సంస్కృతి ఉండటంతోనే చాంపియన్లకి కొదవ లేకుండా పోయిందని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఇలానే సచిన్ ఆ తర్వాత ద్రవిడ్, విరాట్ పుట్టుకొచ్చారని తెలిపాడు.


Click it and Unblock the Notifications
