Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను లేకుంటే 2027 వన్డే ప్రపంచకప్ గెలవడం కష్టం: సౌరవ్ గంగూలీ

వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీలో భారత్ విజయం సాధించాలంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండటం కీలకమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అతను ఉంటే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌గా ఉంచి, ప్రపంచకప్‌కు సిద్ధం చేయడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముందున్న అతి పెద్ద సవాల్‌ అని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌తో భారత్ తలపడనుంది. హార్దిక్ పాండ్యా ఇప్పటికే 2019, 2023 ప్రపంచకప్‌లు ఆడాడు. 2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా చీలమండ గాయం కావడంతో టోర్నీకి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.

Sourav Ganguly Says Hardik Pandya Is Crucial to India s Balance for 2027 World Cup

హార్దిక్ లేకుంటే కష్టం..

తాజాగా మెగా టోర్నీ గురించి మాట్లాడిన గంగూలీ.. హార్దిక్ పాండ్యా అవసరాన్ని నొక్కి చెప్పాడు. 'ప్రపంచకప్‌లో టీమిండియా కాంబినేషన్‌కు హార్దిక్ పాండ్యా చాలా ముఖ్యం. అతన్ని మైదానంలో ఫిట్‌గా ఉంచడం గంభీర్ ముందున్న అతి పెద్ద సవాల్‌. ప్రస్తుతం అతను తగినంత క్రికెట్ ఆడటం లేదు.

ఒకవేళ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే నితీష్ రెడ్డి ప్రత్యామ్నాయం అవుతాడు. కానీ నితీశ్‌ను హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా చూడాలంటే అప్పటివరకు అతను నిలకడగా క్రికెట్ ఆడాలి. ఆ స్థాయిలో ప్రదర్శన చేయాలి.'అని సౌరవ్ గంగూలీ జియో హాట్‌స్టార్‌తో అన్నాడు.

IND vs WI: రోహిత్ ఔట్.. జైస్వాల్ ఇన్! వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs WI: రోహిత్ ఔట్.. జైస్వాల్ ఇన్! వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

ఆ మ్యాచ్ కోసం నేను వెయిటింగ్..

'రవీంద్ర జడేజా కూడా మరో ప్రత్యామ్నాయం. కానీ సౌతాఫ్రికా కండిషన్స్‌లో స్పిన్ కంటే పేస్ ఆల్‌రౌండర్ అవసరం ఉంటుంది. భారత టాప్‌-5 బ్యాటర్లలో ఎవరూ బౌలింగ్ చేయరు కాబట్టి. భారత్‌కు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలంటే ఆల్‌రౌండర్‌ను ఆడించాల్సిందే. తొలి మ్యాచ్‌లోనే భారత్ బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం మంచిదే. సెకండాఫ్‌లో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సొంత గడ్డపై జరిగే ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

భారత ప్రపంచకప్ 2027 షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?

Also Read

భారత ప్రపంచకప్ 2027 షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?

భారత మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ కూడా షెడ్యూల్‌పై స్పందించాడు. ఆరంభంలోనే రెండు కఠినమైన మ్యాచ్‌లు ఆడటం ద్వారా టీమిండియా కాంబినేషన్‌ను పరీక్షించుకోవచ్చని, కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌, వర్క్‌లోడ్‌ను అవసరానికి తగ్గట్టు చూసుకొవచ్చని చెప్పాడు. ఈ ఫార్మాట్‌ పాకిస్థాన్‌కు బాగా నచ్చుతందని, కనీసం సూపర్ 7 చేరవచ్చని ఆ జట్టు భావిస్తుందని సెటైర్లు పేల్చాడు.

Story first published: Friday, October 2, 2026, 19:28 [IST]
Other articles published on Oct 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+