భారత ప్రపంచకప్ 2027 షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?
వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 7న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. గత ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ రిపీట్ కానుంది. ఈ మ్యాచ్ అనంతరం మూడు రోజులకు జోహన్నెబర్గ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వేతో పాటు క్వాలిఫయర్స్ నుంచి వచ్చే మరో అసోసియేట్ దేశంతో గ్రూప్-ఏలో పోటీపడుతుంది.

1983 ప్రపంచకప్‌ను కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి గెలిచిన భారత్.. 2011లో సొంతగడ్డపై ధోనీ సారథ్యంలో ఈ ప్రతిష్మాత్మక ట్రోఫీని గెలిచింది. ముచ్చటగా మూడో సారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఎడిషన్ 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. చివరిసారిగా సౌతాఫ్రికాలో ప్రపంచకప్ 2003 జరిగినప్పుడు భారత్ రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు ఓటమిపాలైంది.
రోహిత్, కోహ్లీలకు ఘన వీడ్కోలు దక్కెనా..?
టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచకప్ గెలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో ఉన్నారు. భారత ఆటగాళ్లు ఈ టోర్నీ గెలిచి రోహిత్, కోహ్లీలకు ఘన వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు.
భారత్ 2027 ప్రపంచకప్ షెడ్యూల్..
గ్రూప్ స్టేజ్..
అక్టోబర్ 7: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, కేప్‌టౌన్
అక్టోబర్ 10: భారత్ వర్సెస్ పాకిస్థాన్, జోహన్నస్ బర్గ్
అక్టోబర్ 14: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్, త్ష్వానే
అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్ A, బ్లూమ్‌ఫోంటైన్
అక్టోబర్ 24: జింబాబ్వే vs భారత్, విక్టోరియా ఫాల్స్
సూపర్ 7 (సీడెడ్ జట్లు అర్హత సాధిస్తే)
సూపర్ 7 (సీడెడ్ జట్లు అర్హత సాధిస్తే)
అక్టోబర్ 28 - భారత్ (ఎ1) vs ఆస్ట్రేలియా (ఎ2) - విక్టోరియా ఫాల్స్
అక్టోబర్ 31 - దక్షిణాఫ్రికా (B2) vs భారత్ (A1) - జోహన్నెస్‌బర్గ్
నవంబర్ 4 - భారత్ (ఎ1) vs న్యూజిలాండ్ (బి1) - పార్ల్
నవంబర్ 7 - భారత్ (ఎ1) vs పాకిస్థాన్ (ఎ3) - కేప్ టౌన్
నవంబర్ 11 - భారత్ (A1) vs ఇంగ్లాండ్ (AB4) - గెబెర్హా
నవంబర్ 14 - భారతదేశం (A1) vs శ్రీలంక (B3) - డర్బన్
నాకౌట్లు
17 నవంబర్ - సెమీ-ఫైనల్ 1 - కేప్ టౌన్
18 నవంబర్ - సెమీ-ఫైనల్ 2 - ష్వానే
21 నవంబర్ - ఫైనల్ - జోహన్నెస్‌బర్గ్
(సెమీస్, ఫైనల్స్‌కు ఒక రిజర్వ్ డే ఉంటుంది)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


