IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ భారత ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ నెట్‌వర్క్‌కు భారీ బొక్క పడింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగడంతో భారీ నష్టాలను మూటగట్టుకుంది. సాధారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ పోరు కోసం ఎదురు చూస్తోంది. అమ్మాయిల మ్యాచ్ అయినా.. భారత్-పాక్ పోరు అంటే అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తారు.
భారత్, పాకిస్థాన్‌లో అయితే అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అందుకే ప్రతీ టోర్నీలో ఈ రెండు జట్లు తలపడేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లను వీకెండ్‌లో నిర్వహిస్తారు. తద్వారా భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవచ్చనేది వారి ప్లాన్. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్‌ను బ్రాడ్‌కాస్టర్స్ వీలైనంత మేరకు సొమ్ము చేసుకుంటాయి.
భారీగా ఖర్చు చేసిన సోనీ నెట్‌వర్క్..
ఈ మ్యాచ్‌ల సందర్భంగా యాడ్స్ రేట్లను రెట్టింపు చేస్తాయి. 5-10 సెకన్ల యాడ్స్‌కు లక్షల్లో వసూలు చేస్తాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తాయి. టోర్నీలో మిగతా మ్యాచ్‌లన్ని ఒక ఎత్తయితే .. భారత్-పాక్ మ్యాచ్ మరో ఎత్తు అనే రేంజ్‌లో ఏర్పాట్లు ఉంటాయి.

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా సోనీ నెట్‌వర్క్ భారీ ఖర్చు చేసింది. ఈ మ్యాచ్‌కు హైప్ తీసుకొచ్చేందుకు సోషల్ మీడియా, గూగుల్ వేదికగా ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టింది. కానీ తీరా ఏకపక్షంగా మ్యాచ్ సాగడం.. పాకిస్థాన్ కనీసం పోటీ ఇవ్వలేకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఖర్చులు కూడా రాలేదు..
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 55 పరుగులకే కుప్పకూలడం.. భారత్ 8.4 ఓవర్లలోపే ముగించడంతో నిర్ణీత సమయం కన్నా ముందే మ్యాచ్ ముగిసింది. 40 ఓవర్ల పాటు జరగాల్సిన మ్యాచ్.. 28.4 ఓవర్లలోనే పూర్తయింది. దాంతో సోనీ నెట్‌వర్క్ స్పాన్సర్స్ తిరగబడినట్లు తెలుస్తోంది. తమ అడ్వాన్స్‌లను తిరిగివ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన సోనీ నెట్‌వర్క్‌కు ఈ మ్యాచ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని యాడ్స్ రంగం నిపుణులు అంటున్నారు.
మహిళల జట్టే కాదు.. పురుషుల టీమ్ కూడా భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. దాంతో భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ సన్నగిల్లుతోంది. పాకిస్థాన్ ప్రదర్శన దయనీయంగా మారడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఏది ఏమైనా.. పాకిస్థాన్ పేలవ ప్రదర్శనతో సోనీ నెట్‌వర్క్‌ను నట్టేట ముంచేసింది.
సత్తా చాటిన తెలుగు తేజం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ( 15 బంతుల్లో ఫోర్‌తో 13), షవాల్ జుఫికర్(14 బంతుల్లో 3 ఫోర్లతో 14) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/7), ప్రేమ రావత్(3/9) మూడేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. దీప్తి శర్మ(2/5) రెండు వికెట్లు పడగొట్టగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది.
అనంతరం భారత్.. 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 57 పరుగులు చేసి 68 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. షెఫాలీ వర్మ(6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12), ప్రతికా రావల్(3 బంతుల్లో ఫోర్‌తో 4), స్మృతి మంధాన(11 బంతుల్లో 2 ఫోర్లతో 9) విఫలమైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్(18 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 18 నాటౌట్), దీప్తి శర్మ(14 బంతుల్లో ఫోర్‌తో 12 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలరల్లో ఫాతిమా సనా(3/17) మూడు వికెట్లు పడగొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


