IND vs PAK: భారత్‌ను ఓడిస్తాం.. టైటిల్ గెలుస్తాం: పాక్ కోచ్
IND vs PAK: మహిళల టీ20 ఆసియా కప్ 2026 లీగ్ దశ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో పాకిస్తాన్ మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత బౌలర్ల ధాటికి తాళలేక పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో భారత మహిళల జట్టు టోర్నీలో తన విజయ పరంపరను కొనసాగించడమే కాకుండా గ్రూప్‌లో తన అగ్రస్తానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఈ ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోడ్ వహాబ్ రియాజ్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసినప్పటికీ.. ఆయన మాట్లాడిన తీరు చూసి క్రీడాభిమానులు, విశ్లేషకులు తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్‌పై పరాజయాన్ని చవిచూసిన అనంతరం కూడా ఆయన తన జట్టుపై అపారమైన నమ్మకాన్ని కనబరిచారు. వహాబ్ రియాజ్ మాట్లాడుతూ.. " ఈ ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకోవడానికి పాకిస్తానే అత్యుత్తమ జట్టు అని నేను ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. ఇక్కడి దుబాయ్ పిచ్ పరిస్థితులు మా ఆట తీరుకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు. రాబోయే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఖచ్చితంగా పుంజుకుని టోర్నీలో ముందుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కేవలం 55 పరుగులకే పరిమితమైంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఒక దశలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసి పటిష్ట స్థితిలోనే కనిపించింది. కానీ ఆ తర్వాత భారత స్పిన్నర్లు విరుచుకుపడటంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ పేకముక్కల్లా కూలిపోయింది. శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లతో రాణించారు. దీంతో పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా దూకుడుగా ఆడింది. కేవలం 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఏకంగా 68 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని ఆసియా కప్ లో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


