Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

బ్యాటింగ్ వైఫల్యంతోనే భారత చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తెలిపింది. కొత్త వికెట్ కావడంతో బ్యాటింగ్ పరంగా చాలా ఇబ్బంది పడ్డామని చెప్పింది. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

Womens Asia Cup 2026: మేం గెలిచినా.. థాయిలాండ్ బాగా ఆడింది: హర్మన్‌ప్రీత్ కౌర్

Womens Asia Cup 2026: మేం గెలిచినా.. థాయిలాండ్ బాగా ఆడింది: హర్మన్‌ప్రీత్ కౌర్

భారత్ స్పిన్ త్రయం శ్రీచరణి, దీప్తి శర్మ, ప్రేమ రావత్ ధాటికి పాకిస్థాన్ విలవిలలాడింది. 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. హాంగ్ కాంగ్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే పాక్‌కు సెమీస్ బెర్త్ దక్కనుంది.

Fatima Sana Blames Batting Collapse for Pakistan s Heavy Defeat Against India in Women s Asia Cup 2026

భారత్‌తో ఓటమి అనంతరం మాట్లాడిన ఫాతిమా సనా.. తమ తదుపరి మ్యాచ్‌లో సత్తా చాటి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. 'బ్యాటింగ్ పరంగా మేం చాలా ఇబ్బంది పడ్డాం. దాంతోనే కుప్పకూలిపోయాం. ఇది కొత్త వికెట్ అని తెలుసు. అందుకే భారీ స్కోర్ చేయాలనుకున్నాం. మా బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. నేను మూడు వికెట్లు తీసినా ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. పర్వాలేదు. కచ్చితంగా తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సెమీఫైనల్ చేరే ప్రయత్నం చేస్తాం.'అని ఫాతిమా సనా చెప్పుకొచ్చింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ( 15 బంతుల్లో ఫోర్‌తో 13), షవాల్ జుఫికర్(14 బంతుల్లో 3 ఫోర్లతో 14) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/7), ప్రేమ రావత్(3/9) మూడేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. దీప్తి శర్మ(2/5) రెండు వికెట్లు పడగొట్టగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది.

IND vs PAK: రఫ్ఫాడించిన తెలుగు తేజం.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

Also Read

IND vs PAK: రఫ్ఫాడించిన తెలుగు తేజం.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

అనంతరం భారత్.. 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 57 పరుగులు చేసి 68 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. షెఫాలీ వర్మ(6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12), ప్రతికా రావల్(3 బంతుల్లో ఫోర్‌తో 4), స్మృతి మంధాన(11 బంతుల్లో 2 ఫోర్లతో 9) విఫలమైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్(18 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 18 నాటౌట్), దీప్తి శర్మ(14 బంతుల్లో ఫోర్‌తో 12 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలరల్లో ఫాతిమా సనా(3/17) మూడు వికెట్లు పడగొట్టింది.

Story first published: Saturday, September 5, 2026, 22:51 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+