IND vs ZIM: ఆదుకున్న దీప్తి శర్మ.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ గెలుపుతో స్మృతి మంధాన తన కెప్టెన్సీ ప్రయాణాన్ని ఘనంగా మొదలుపెట్టింది. ఇటీవలే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా మంధాన ఎంపికైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. షేర్న్ మేయర్స్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), కెలిన్ నిధ్లోవు(44 బంతుల్లో 7 ఫోర్లతో 42) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నందిని శర్మ(2/11) రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 15.4 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి గెలుపొందింది. నికీ ప్రసాద్(35 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్), దీప్తి శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లతో 49) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యాశా గ్వాంజుర(3/18) మూడు వికెట్లు తీయగా.. మిచెల్లా మావుంగా, చేర్, బిజా తలో వికెట్ తీసారు.
115 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ స్మృతి మంధాన(9), షెఫాలీ వర్మ(4), అనుష్క శర్మ(4), హర్మన్‌ప్రీత్ కౌర్(1) తీవ్రంగా నిరాశపర్చారు. ఈ పరిస్థితుల్లో దీప్తి శర్మ, నికీ ప్రసాద్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం రాయ్‌పూర్ వేదికగానే జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
