IND vs NZ: న్యూజిలాండ్ టూర్.. భారత వన్డే, టెస్ట్ జట్లను ప్రకటించిన బీసీసీఐ!
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్ట్ టీమ్‌లను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్ల వివరాలను భారత సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. టెస్ట్‌లతో పాటు తొలి మూడు వన్డేలకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనుండగా.. చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేయనున్నాడు.
ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన బీసీసీఐ.. ఐదు వన్డేల సిరీస్‌కు రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. తొలి మూడు వన్డేలకు రెగ్యులర్ టీమ్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..చివరి రెండు వన్డేలకు టెస్ట్ ఆటగాళ్లను దూరంగా ఉంచింది. టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
హార్దిక్ దూరం..
ఈ పర్యటనకు కూడా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వన్డేల్లో జడేజాకు మరోసారి అవకాశం దక్కలేదు. ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడిన అతను.. న్యూజిలాండ్ పర్యటనలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్ట్ టీమ్‌లో మాత్రం అవకాశం అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని సెలెక్టర్లు మరోసారి పట్టించుకోలేదు. వన్డేలతో పాటు టెస్ట్ టీమ్‌లోకి కూడా అతన్ని తీసుకోలేదు.
కొత్తగా కుమార్ కుశాగ్రా చివరి రెండు వన్డేలకు ఎంపికవ్వగా.. యష్ ఠాకూర్‌కు కూడా అవకాశం దక్కింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. నితీష్ కుమార్ రెడ్డి వన్డేలతో పాటు టెస్ట్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు. చివరి రెండు వన్డేలకు తిలక్ వర్మ కూడా ఎంపికయ్యాడు. తొలి మూడు వన్డేలతో పాటు టెస్ట్ టీమ్‌లో సిరాజ్‌కు చోటు కల్పించారు. కుల్దీప్ యాదవ్ మూడు జట్లలో ఉన్నాడు. ప్రసిధ్ కృష్ణ, రిషభ్ పంత్ ఫిట్నెస్ క్లియర్ చేయాల్సి ఉంది.

అక్టోబర్ 22 నుంచి షురూ..
అక్టోబర్ 22 నుంచి మొదలవ్వనున్న ఈ పర్యటనలో ముందుగా ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్ నిర్వహించనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2027లో ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ టెస్ట్ సిరీస్‌ను టీమిండియా గెలవాలి. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు టీమిండియా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.
తొలి మూడు వన్డేల కోసం భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అంశుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ*, కుల్దీప్ యాదవ్
నాల్గవ మరియు ఐదవ వన్డేల కోసం భారత వన్డే జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యష్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్
భారత టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అంశుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


