Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని స్మృతి మంధాన!(వీడియో)

భారత మహిళల వన్డే కెప్టెన్ స్మృతి మంధాన, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కెప్టెన్సీ విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. అయితే మైదానంలో ఈ ఇద్దరి ప్రవర్తన ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. బయటకు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నా.. మైదానంలో మాత్రం ఒకరినొకరు చూసుకోవడం లేదు. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం లేదు.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. రెండో వన్డేలో భారీ శతకంతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్ గురించి స్మృతి మంధాన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా మూడు వన్డే విజయానంతరం హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మిగతా ఆటగాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన మంధాన.. హర్మన్‌ప్రీత్ కౌర్ రాగానే ముఖం చాటేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ
Smriti Mandhana Handshake Snub to Harmanpreet Kaur Fuels Fresh Dressing Room Rift Rumours Video

అసలేం జరిగిందంటే..?

బుధవారం వడోదర వేదికగా జరిగిన ఆఖరి వన్డే సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఒకరినొకరు ఎదురుపడ్డారు.

అయితే హర్మన్‌ప్రీత్ కౌర్‌ దగ్గరకు రావడాన్ని గమనించిన స్మృతి మంధాన ఉద్దేశపూర్వకంగా వెనక్కి తిరిగి ప్రేక్ష‌కులవైపు చూసింది. దాంతో మరో ప్లేయర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుకు సాగింది. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య విభేదాలు నిజమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?

Also Read

IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?

కెప్టెన్సీ విషయంలో గొడవ..

మిథాలీ రాజ్ అనంతరం 2016లో భారత మహిళల వన్డే జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ దశాబ్దం పాటు కెప్టెన్‌గా కొనసాగింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ తొలి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచింది. అయితే ఈ టోర్నీ అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకొని స్మృతి మంధానకు అవకాశం ఇస్తారని భావించారు. కానీ కెప్టెన్సీ వదులుకునేందుకు హర్మన్‌ప్రీత్ అంగీకరించలేదు.

దాంతో స్మృతి మంధాన సెలెక్టర్లతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. బ్యాటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ కూడా విఫలమవడంతో మంధానకు మార్గం సుగుమమైంది. జింబాబ్వే సిరీస్‌తో‌నే సారథ్య బాధ్యతలు అందుకున్న స్మృతి మంధాన రెండు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది.

Story first published: Thursday, October 29, 2026, 17:06 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+