Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మృతి మంధాన భారీ శతకం.. హాంకాంగ్‌పై ఘన విజయం!

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన(64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 124) భారీ శతకంతో భారత్ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారైంది.

Womens Asia Cup 2026: మేం గెలిచినా.. థాయిలాండ్ బాగా ఆడింది: హర్మన్‌ప్రీత్ కౌర్

Womens Asia Cup 2026: మేం గెలిచినా.. థాయిలాండ్ బాగా ఆడింది: హర్మన్‌ప్రీత్ కౌర్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. స్మృతి మంధాన సెంచరీతో కదం తొక్కగా.. షెఫాలీ వర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. హాంకాంగ్ బౌలర్లలో మారినా రెండు వికెట్లు తీయగా.. రుచితా వెంకటేష్, జాయ్‌లీన్ కౌర్ తలో వికెట్ తీసారు.

Smriti Mandhana Century Powers India to 137-Run Win Over Hong Kong Reach Women s Asia Cup 2026 Semi-Finals

కొనసాగిన భారత్ బ్యాటింగ్ వైఫల్యం..

అనంతరం హాంకాంగ్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ(3/9) మూడు వికెట్లు తీయగా.. తెలుగు తేజం శ్రీ చరణి(2/16), ప్రేమ రావత్(2/12), నందని శర్మ(2/6) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. గత మ్యాచ్ తరహాలోనే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగడం కలవరపెడుతోంది. భారత జట్టు చేసిన 193 పరుగుల్లో మంధాననే 124 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు సాధించింది 62 మాత్రమే. స్మృతి రాణించకపోయి ఉంటే భారత్ కూడా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.

స్మృతి విధ్వంసం..

థాయ్‌లాండ్‌పై 19 పరుగులే చేసిన స్మృతి ఈ మ్యాచ్‌లో చెలరేగింది. ఆరంభం నుంచే హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడింది. షెఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలోనే భారత్ 60 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన షెఫాలీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. ప్రతీక రావల్, రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మృతి తన దూకుడును కొనసాగించింది.

5 పరుగులు.. 7 వికెట్లు! చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్!

Also Read

5 పరుగులు.. 7 వికెట్లు! చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్!

40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన స్మృతి.. మరో 17 బంతుల వ్యవధిలోనే సెంచరీ పూర్తి చేసుకుంది. సెంచరీ అనంతరం మరో మూడు భారీ సిక్సర్లతో పాటు బౌండరీ కొట్టింది. ఆఖరి ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది. శనివారం పాకిస్థాన్ మహిళలతో భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Friday, September 4, 2026, 6:19 [IST]
Other articles published on Sep 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+