5 పరుగులు.. 7 వికెట్లు! చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్!
శ్రీలంక మహిళల కెప్టెన్ చమరి ఆటపట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ చరిత్రలోనే 7 వికెట్లు తీసిన తొలి పురుష, మహిళా ప్లేయర్‌గా చమరి ఆటపట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా.. ఇండోనేషియాతో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో చమరి ఆటపట్టు ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన ఆటపట్టు 5 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్లేయర్ జావెరియా ఖాన్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. 2008 మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జావెరియా ఖాన్ 6 వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో 7 వికెట్లు తీసిన రెండో కెప్టెన్‌గా కూడా ఆటపట్టు రికార్డ్ నమోదు చేసింది.

గతంలో అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టోక్స్ మాత్రమే ఈ ఘనతను అందుకుంది. శ్రీలంక తరఫున ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఆట పట్టు రికార్డ్ సాధించింది. అజంతా మెండీస్ 6 వికెట్ల రికార్డ్‌ను అధిగమించింది.
ఆసియా కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డ్స్
చమరి ఆటపట్టు: 7/5 vs ఇండోనేషియా
జవేరియా ఖాన్ : 6/8 vs బంగ్లాదేశ్
మమత మాబెన్: 6/10 vs శ్రీలంక
అజంతా మెండిస్ : 6/13 vs భారత్
మహమ్మద్ సిరాజ్: 6/21 vs శ్రీలంక
భువనేశ్వర్ కుమార్: 5/4 vs ఆఫ్ఘనిస్తాన్
పురుషుల ఆసియా కప్‌లో ఈ రికార్డ్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. అతను ఆసియా కప్ టీ20 టోర్నీలో ఐదు వికెట్లు తీసాడు. బుధవారం జరిగిన మహిళల ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 125 పరుగులు చేసింది. అనంతరం ఇండోనేషియా కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. చమరి ఆటపట్టు అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసియా కప్ సెమీ ఫైనల్ బెర్త్‌ను శ్రీలంక ఖరారు చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

