Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens Asia Cup 2026: మేం గెలిచినా.. థాయిలాండ్ బాగా ఆడింది: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. థాయ్‌‌లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 94 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో తడబడినా హర్మన్ సేన్.. బౌలింగ్‌లో మాత్రం నిప్పులు చెరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో తాము గెలిచినా థాయ్‌లాండ్ అద్భుతంగా ఆడిందని హర్మన్‌ప్రీత్ కౌర్ కొనియాడింది. అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శనతో ఓడించినంత పనిచేసిందని చెప్పుకొచ్చింది.

మహిళల ఆసియా కప్.. భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

మహిళల ఆసియా కప్.. భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

షెఫాలీ వర్మ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసింది. షెఫాలీ వర్మ(36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. వరుస విరామల్లో భారత్ వికెట్లు కోల్పోయింది. షెఫాలీ వర్మ ఒంటరి పోరాటంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది.

Harmanpreet Kaur Hails Thailand s Bowling Despite India s 94-Run Win in Women s Asia Cup 2026

థాయిలాండ్ బౌలర్లలో సులీపోర్న్ లావోమి మూడు వికెట్లు తీయగా.. సునిదా చతురోంగ్రత్తన రెండు వికెట్లు పడగొట్టింది. చనిదా, తిపచ్చా పుత్తావోంగ్ తలో వికెట్ తీసారు. అనంతరం థాయిలాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. నన్నపత్ కొంచరోయెంకై(48 బంతుల్లో 5 ఫోర్లతో 41) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, నందని శర్మ మూడేసి వికట్లు తీయగా.. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్‌కు ఒక వికెట్ దక్కింది.

మా కంటే బాగా బౌలింగ్ చేసింది..

ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హర్మన్‌ ప్రీత్ కౌర్.. తమ బ్యాటర్లు సరైన షాట్స్ ఆడలేదని అంగీకరించింది. థాయిలాండ్ తమకంటే బాగా బౌలింగ్ చేసిందని ప్రశంసించింది. ' బ్యాటింగ్‌లో మాకు మెరుగైన ఆరంభమే లభించింది. కానీ ఆ తర్వాత మా బ్యాటర్లు చెత్త షాట్లతో పెవిలియన్‌కు క్యూ కట్టారు.

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!

Also Read

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!

కొత్త బంతి బ్యాట్‌పైకి బాగా వచ్చింది. కానీ ఆ తర్వాత వికెట్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. కానీ మా బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన థాయిలాండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం కూడా అలా మా బౌలింగ్ ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. ఆసియా కప్‌లో ఆడుతున్న అని జట్లు చాలా మెరుగుపడ్డాయి. కాబట్టి మేం ఏ జట్టును తేలికగా తీసుకోం'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

Story first published: Monday, August 31, 2026, 9:45 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+