IND vs SL: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఊచకోత..!
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న ఫైనల్లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), షెఫాలీ వర్మ(39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, చమరి ఆటపట్టు, చముడి ప్రబోదా తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన పోటాపడి బౌండరీలు బాదడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చారు.

షెఫాలీ వర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్థ శతకం సాధించింది. 129 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ప్రబోదా విడదీసింది. షెఫాలీ వర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఆ వెంటనే స్మృతి మంధాన రనౌట్ కావడంతో భారత పరుగుల వేగానికి బ్రేక్ పడింది.
ఒక ఫోర్, సిక్స్‌తో రిచా ఘోష్(17) దూకుడు కనబర్చినా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్(14), దీప్తి శర్మ(5) నిరాశపర్చగా.. గునలన్ కమలిని(15 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 183 పరుగులకు చేర్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


