Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shree Charani: చరిత్ర సృష్టించిన కడప రెడ్డమ్మ.. కుల్దీప్ యాదవ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం శ్రీ చరణి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీ చరణి ఒక వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ఈ కడప రెడ్డమ్మ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. ఇది శ్రీచరణికి 50వ వికెట్ కాగా.. 29 మ్యాచ్‌ల్లోనే ఆమె ఈ ఫీట్ సాధించింది. తద్వారా కుల్దీప్ యాదవ్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. భారత పురుష, మహిళా క్రికెటర్లలో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా శ్రీ చరణి రికార్డ్‌కెక్కింది.

ఆ ఇద్దరే మా జట్టును ఫైనల్‌కు చేర్చారు: హర్మన్‌ప్రీత్ కౌర్

ఆ ఇద్దరే మా జట్టును ఫైనల్‌కు చేర్చారు: హర్మన్‌ప్రీత్ కౌర్

రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా..

2023లో కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్‌ల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. శ్రీ చరణి 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వరుణ్ చక్రవర్తీ(32 మ్యాచ్‌లు), అర్ష్‌దీప్ సింగ్(33 మ్యాచ్‌లు), రాధా యాదవ్(35 మ్యాచ్‌ల్లో) అత్యంత వేగంగా 50 వికెట్ల ఘనతను అందుకున్న జాబితాలో కొనసాగుతున్నారు.

Shree Charani Creates History Breaks Kuldeep Yadav s Record in India s Women s Asia Cup 2026 semi-final

మహిళా క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. చైనాకు చెందిన మెంగ్టింగ్ లియు 28 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. శ్రీచరణి, లీ కాస్పరెక్, అనీసా మహమ్మద్ 29 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకొని రెండో స్థానంలో కొనసాగుతున్నారు. సోఫీ ఎక్లెస్టోన్ 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకుంది.

రెండో పిన్న వయస్కురాలిగా..

50 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో భారత పిన్న వయస్కురాలిగా కూడా శ్రీచరణి రికార్డ్ సాధించింది. 22 ఏళ్ల 37 రోజుల వయసులో శ్రీచరణి ఈ ఘనతను అందుకుంది. రాధా యాదవ్ 20 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనతను అందుకొని అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ(22 ఏళ్ల 187 రోజులు), రవి బిష్ణోయ్(24 ఏళ్ల 37 రోజులు), పూజ వస్త్రాకర్ (26 ఏళ్ల 200 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పూనమ్ యాదవ్‌తో శ్రీచరణి సమంగా నిలిచింది. ఈ ఏడాది శ్రీచరణి 35 వికెట్లు తీయగా.. పూనమ్ యాదవ్ 2018లో 35 వికెట్లు పడగొట్టింది. ఈమెను శ్రీచరణి అధిగమించే అవకాశం ఉంది.

ఫైనల్‌కు భారత్..

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-1లో సమష్టిగా రాణించిన భారత్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. షె ఫాలీ వర్మ(40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(24), రిచా ఘోష్(21), ప్రతికా రావల్(20) పర్వాలేదనిపించారు.

స్మృతి మంధాన(2), దీప్తి శర్మ(13), భార్తి ఫుల్మాలి(0) తీవ్రంగా నిరాశపర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తాన ఖాటున్ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసారు.

IND vs BAN: అందుకే చిత్తుగా ఓడాం: బంగ్లాదేశ్ కెప్టెన్

Also Read

IND vs BAN: అందుకే చిత్తుగా ఓడాం: బంగ్లాదేశ్ కెప్టెన్

అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులే చేసి ఓటమిపాలైంది. దిలారా అక్తర్(21), షోర్నా అక్తర్(22 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/26), నందని శర్మ(2/10) బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. తెలుగు తేజం శ్రీచరణి, ప్రేమ్ రావత్‌కు చెరో వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Story first published: Friday, September 11, 2026, 13:24 [IST]
Other articles published on Sep 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+