Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డ్‌!

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. విధ్వంసకర శతకంతో ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డ్స్‌ను తన పేరిట లిఖించుకుంది. మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా స్మృతి మంధాన చరిత్రకెక్కింది.

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం హాంకాంగ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 124) భారీ శతకంతో చెలరేగింది. తద్వారా ఈ ఘనతలను సొంతం చేసుకుంది.

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మగాళ్లకు సాధ్యం కానీ రికార్డ్!

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మగాళ్లకు సాధ్యం కానీ రికార్డ్!

ఈ సెంచరీతో స్మృతి మంధాన.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 10,880 పరుగులకు చేరుకుంది. దాంతో భారత దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్‌ను స్మృతి మంధాన అధిగమించింది. 333 ఇన్నింగ్స్‌ల్లో మిథాలీ రాజ్ 10868 పరుగులు చేయగా.. స్మృతి మంధాన 303 ఇన్నింగ్స్‌ల్లోనే 10880 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. స్మృతి వన్డేల్లో 5411, టీ20ల్లో 4681, టెస్ట్‌ల్లో 788 పరుగులు సాధించింది.

Smriti Mandhana Breaks Mithali Raj s World Record Achieves Historic Feat Like Sachin Tendulkar

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..

స్మృతి మంధాన 303 ఇన్నింగ్స్‌ల్లో 10880

మిథాలీ రాజ్ 333 ఇన్నింగ్స్‌ల్లో 10868

సుజీ బేట్స్ 370 ఇన్నింగ్స్‌ల్లో 10740

షార్లెట్ ఎడ్వర్డ్స్ 309 ఇన్నింగ్స్‌ల్లో 10273

సారా టేలర్ 307 ఇన్నింగ్స్‌ల్లో 10007

అత్యధిక సెంచరీల రికార్డ్..

తాజా సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన మహిళా క్రికెటర్‌గానూ స్మృతి మంధాన రికార్డ్ అందుకుంది. మూడు ఫార్మాట్లలో కలిసి స్మృతి మంధాన 18 శతకాలు నమోదు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ప్లేయర్ మెగ్ లానింగ్(17), సౌతాఫ్రికా బ్యాటర్ లాలా వోల్వార్ట్(17)లను స్మృతి మంధాన అధిగమించింది. వన్డేల్లో 14 శతకాలు నమోదు చేసిన స్మృతి మంధాన టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో రెండు సెంచరీలు సాధించింది.

తొలి భారత ప్లేయర్‌గా..

అంతర్జాతీయ టీ20ల్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. గతేడాది ఇంగ్లండ్‌పై 62 బంతుల్లో 112 తొలి సెంచరీ బాదిన మంధాన.. తాజా శతకంతో ఈ ఫీట్ సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20ల్లో ఒక సెంచరీ చేయగా.. మరే బ్యాటర్ ఈ ఫీట్ సాధించలేదు. ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గానూ స్మృతి నిలిచింది.

స్మృతి మంధాన భారీ శతకం.. హాంకాంగ్‌పై ఘన విజయం!

Also Read

స్మృతి మంధాన భారీ శతకం.. హాంకాంగ్‌పై ఘన విజయం!

సచిన్ సరసన రికార్డుల రారాణి..

పురుషుల క్రికెట్‌లో రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ తరహాలోనే.. మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన రికార్డుల రారాణిగా నిలిచింది. సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు, సెంచరీల రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 34357 పరుగులు(టెస్ట్‌ల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10), 100 శతకాలు( టెస్ట్‌ల్లో 51, వన్డేల్లో 49) సాధించిన సంగతి తెలిసిందే.

స్మృతి మంధాన కూడా మహిళల క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించింది. వన్డేల్లో 14 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆమె.. మరో రెండు సెంచరీలు కొడితే.. ఆ ఫార్మాట్‌లో కూడా టాప్ ప్లేయర్‌గా నిలవనుంది.

Story first published: Friday, September 4, 2026, 6:52 [IST]
Other articles published on Sep 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+