హర్మన్‌ప్రీత్ కౌర్ X స్మృతి మంధాన డిష్యూం డిష్యూం.. ముఖం చూసుకోని దిగ్గజాలు!
భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య విభేదాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కనీసం ఒకరినొకరు చూసుకోలేని స్థితిలో గొడవపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.
సారథ్య బాధ్యతల నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోగా.. స్మృతి మంధానను నయా కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను కూడా ప్రకటించింది.
రెండుగా చీలిపోయిన జట్టు..
ఇటీవలే జపాన్ వేదికగా ముగిసిన ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచింది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న క్రమంలో హర్మన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంది. స్మృతి మంధానతో విభేదాలు రావడంతోనే హర్మన్ తప్పుకుందనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎడమొహం, పెడ మొహంగా ఉంటున్నారని, జట్టు కూడా రెండు గ్రూప్స్‌గా చీలిపోయిందనే వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి.

ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కనీసం ఒకరినొకరు చూసుకోకపోవడంతో యువ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. హర్మన్‌ప్రీత్ మైదానంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోగా.. వైస్ కెప్టెన్‌గా మంధాన వాటిని వ్యతిరేకించేదని సమాచారం. జట్టు వ్యూహాలు, కమ్యూనికేషన్ విషయంలో ఇద్దరి మధ్య సయోధ లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ 2025 విజయం తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని స్మృతి మంధాన సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే మంధాన, స్మృతి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
నాయకత్వ మార్పును సూచించడంతో..
ఇటీవల బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ హాజరయ్యారు. జట్టు భవిష్యత్తుపై జరిగిన చర్చ సందర్భంగా నాయకత్వ మార్పు అనివార్యమని, 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కొనసాగించలేమని బీసీసీఐ పెద్దలు అన్నట్లు సమాచారం. దాంతో హర్మన్ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని ప్లేయర్‌గా కొనసాగుతానని పేర్కొంది.
మరోవైపు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ మెరుగైన ఫలితాలను అందించినా.. వ్యక్తిగతంగా ఆశించిన రీతిలో రాణించలేకపోతుంది. ఇక నుంచి ఆమె రాణిస్తేనే జట్టులో కొనసాగనుంది. రాయ్‌పూర్ వేదికగా ఈ నెల 16, 18, 20 తేదీల్లో జింబాబ్వేతో భారత మహిళల జట్టు టీ20 సిరీస్.. 23, 25, 28 తేదీల్లో వడోదర వేదికగా వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల నుంచే స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టనుంది. టీ20ల్లో షెఫాలీ వర్మ, వన్డేల్లో దీప్తి శర్మ.. స్మృతి మంధానకు డిప్యూటీగా వ్యవహరించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


