హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై!
భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత కెప్టెన్సీ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి మూడు ఫార్మాట్లలో కేవలం ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేసింది.
సుదీర్ఘ కాలం పాటు భారత జట్టు సారథిగా కొనసాగిన హర్మన్‌ప్రీత్ కౌర్ చిర్మసరణీయమైన విజయాలను అందించింది. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలు 2026లో భారత జట్టుకు వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ విజయం సాధించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది.

భావోద్వేగభరితమైన పోస్ట్..
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకుంది. 'కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం అంత ఈజీ కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, జట్టు ఎదుగుదల కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఉన్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకున్న ఈ క్షణాన నా హృదయం భావోద్వేగాలతో నిండి ఉంది.
కానీ అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా జట్టు ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉందని నేను విశ్వసిస్తున్నా. ఇక నుంచి జట్టులో ఒక సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతాను. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచర ప్లేయర్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి, బీసీసీఐకి, నా కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు''అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.
వన్డే ప్రంపచకప్ విజయంతో..
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాలు సాధించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025 వన్డే ప్రపంచకప్ అందించింది. ఈ విజయం తర్వాతే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతుందని అంతా అనుకున్నారు. కానీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా కొనసాగింది.
ఈ టోర్నీలో నిరాశపర్చినా.. ఆసియా కప్ 2026, ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను విజేతగా నిలబెట్టి సగర్వంగా తన బాధ్యతల నుంచి తప్పుకుంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నిష్క్రమణతో భారత మహిళా క్రికెట్‌లో ఒక విజయవంతమైన శకం ముగిసినట్లయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


