Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత మహిళల నయా కెప్టెన్‌గా స్మృతి మంధాన..!

భారత మహిళల క్రికెట్ జట్టు నయా కెప్టెన్‌గా స్మృతి మంధాన నియమితురాలైంది. అందరూ ఊహించనట్లుగానే ఈ క్రికెట్ క్వీన్‌కు బీసీసీఐ పట్టం కట్టింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో స్మృతి మంధానకు ఈ అవకాశం దక్కింది.

ఇటీవలే ఆసియా గేమ్స్ 2026‌లో భారత్‌కు స్వర్ణం అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మంగళవారం తన సంచలన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి మూడు ఫార్మాట్లలో కేవలం ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేసింది. కెప్టెన్‌గా తన అద్యాయం ముగిసినా.. భారత క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పింది.

సెంచరీ కోసం కాదు.. అందుకే శ్రేయస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇచ్చా: ఇషాన్ కిషన్

సెంచరీ కోసం కాదు.. అందుకే శ్రేయస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇచ్చా: ఇషాన్ కిషన్

భవిష్యత్తు టోర్నీల కోసం..

హర్మన్‌ప్రీత్ కౌర్ 5 టెస్ట్‌లు, 51 వన్డేలు, 155 టీ20ల్లో జట్టును నడిపించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 అందించి భారత చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2028 ప్రపంచకప్‌తో పాటు ఒలింపిక్స్‌ను దృష్టిలోపెట్టుకొని నయా కెప్టెన్‌ను తీసుకురావాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.

BCCI Names Smriti Mandhana as India Women s Captain After Harmanpreet Kaur Steps Down

ఈ క్రమంలోనే హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకొని స్మృతి మంధానకు అవకాశం కల్పించింది. మూడు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాననే కెప్టెన్‌గా కొనసాగనుంది. టీ20ల్లో షెఫాలీ వర్మ, వన్డేల్లో దీప్తి శర్మ.. స్మృతి మంధానకు డిప్యూటీగా వ్యవహరించనున్నారు.

ఇది గొప్ప గౌరవం..

కెప్టెన్‌గా స్మృతి మంధానకు మంచి రికార్డ్ ఉంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని రెండు సార్లు విజేతగా నిలిపింది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించింది. కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది.

IND vs WI: శ్రేయస్ అయ్యర్ శతకం.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

Also Read

IND vs WI: శ్రేయస్ అయ్యర్ శతకం.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

'భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాకు చాలా పెద్ద విషయం. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈ జట్టును నడిపించే అవకాశం రావడం ఎప్పటికీ మరచిపోలేనిది. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన బీసీసీఐ, సెలెక్టర్లు, నా సహచర ఆటగాళ్లు, నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

హర్మన్‌ప్రీత్ సూపర్ కెప్టెన్..

అలాగే సుదీర్ఘ కాలం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ గొప్పగా జట్టును నడిపింది. భారత మహిళల క్రికెట్ ప్రయాణంలో ఆమె కీలక పాత్ర పోషించింది. కెప్టెన్‌ బాధ్యత ఎంత పెద్దదో నాకు బాగా తెలుసు. జట్టుతో కలిసి పనిచేస్తూ, ప్రయాణంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ.. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నిస్తాను.'అని మంధాన చెప్పుకొచ్చింది. రాయ్‌పూర్ వేదికగా ఈ నెల 16, 18, 20 తేదీల్లో జింబాబ్వేతో భారత మహిళల జట్టు టీ20, వన్డే సిరీస్ ఆడనుంది.

Story first published: Wednesday, October 7, 2026, 10:42 [IST]
Other articles published on Oct 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+