Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఇంగ్లండ్‌పై సంచలన విజయం!

వన్డే క్రికెట్‌లో శ్రీలంక చరిత్ర సృష్టించింది. 430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డును లిఖించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా చరిత్రకెక్కింది. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 429 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యారీ బ్యూక్(116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్‌లతో 202)విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. 75 బంతుల్లో సెంచరీ బాదిన అతను మరో 39 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్‌(117 బంతుల్లో) రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. విల్ జాక్స్(66 నాటౌట్) జోరూట్(69), టామ్ బాంటమ్(50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

SL vs ENG Sri Lanka Script History with Record 430-Run Chase as Harry Brook s Double Century Goes in Vain

అనంతరం శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లకు 430 పరుగులు చేసి గెలుపొందింది. అవిష్కా ఫెర్నాండో(83 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97), డసన్ షనక(50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 97) తృటిలో సెంచరీలు చేజార్చుకోగా.. పవన్ రత్నాయకే(106 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 130) సెంచరీతో సత్తా చాటాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(3/79) మూడు వికెట్లు తీయగా.. సామ్ కరణ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లు పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక ఒకటి గెలిచి మరొకటి ఓడింది. ఇంగ్లండ్ మాత్రం రెండు మ్యాచ్‌లకు రెండు ఓడింది.

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

ఈ హైస్కోరింగ్ గేమ్‌లో నమోదైన రికార్డ్స్..

1. వన్డేల్లో ఛేజింగ్ రికార్డ్స్

435 - సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, జోహన్నెస్‌బర్గ్ (2006)

430 - శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్, రావల్పిండి (2026)

406 - భారత్ వర్సెస్ వెస్టిండీస్, గువాహటి (2026)

375 - నెదర్లాండ్స్ వర్సెస్ వెస్టిండీస్, హరారే (2023 - సూపర్ ఓవర్ విజయం)

372 - సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, డర్బన్ (2016)

2. ఓడిపోయిన మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

202 - హ్యారీ బ్రూక్ వర్సెస్ శ్రీలంక, రావల్పిండి (2026)

194* - చార్లెస్ కొవెంట్రీ వర్సెస్ బంగ్లాదేశ్, బులవాయో (2009)

193 - ఫఖర్ జమాన్ వర్సెస్ సౌతాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్ (2021)

191 - జార్జ్ మున్సే వర్సెస్ నెదర్లాండ్స్, డండీ (2025)

181* - మాథ్యూ హేడెన్ వర్సెస్ న్యూజిలాండ్, హామిల్టన్ (2007)

3. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలు- బంతుల ఆధారంగా

114 బంతులు - హ్యారీ బ్రూక్ వర్సెస్ శ్రీలంక, రావల్పిండి (2026)

117 బంతులు - శుబ్‌మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, గువాహటి (2026)

126 బంతులు - ఇషాన్ కిషన్ వర్సెస్ బంగ్లాదేశ్, ఛట్టోగ్రామ్ (2022)

128 బంతులు - గ్లెన్ మాక్స్‌వెల్ వర్సెస్ అఫ్గానిస్తాన్, ముంబై (2023)

136 బంతులు - పతుమ్ నిస్సంక వర్సెస్ అఫ్గానిస్తాన్, పల్లెకెలె (2024)

4. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు..

202 - హ్యారీ బ్రూక్ వర్సెస్ శ్రీలంక, రావల్పిండి (2026)

182 - బెన్ స్టోక్స్ వర్సెస్ న్యూజిలాండ్, ది ఓవల్ (2023)

180 - జేసన్ రాయ్ వర్సెస్ ఆస్ట్రేలియా, మెల్బోర్న్ (2018)

171 - అలెక్స్ హేల్స్ వర్సెస్ పాకిస్తాన్, ట్రెంట్ బ్రిడ్జ్ (2016)

167* - రాబిన్ స్మిత్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఎడ్జ్‌బాస్టన్ (1993)

Story first published: Friday, October 23, 2026, 9:34 [IST]
Other articles published on Oct 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+