Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

బౌలింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పవర్ ప్లేలో కట్టడిగా బౌలింగ్ చేసినా.. చివర్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన విచెల్ సాంట్నర్.. ఇరు జట్లలో సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయని చెప్పాడు. ఈ మైదానంలో క్యాచ్‌లు అందుకోవడం అంత సులువు కాదని, కానీ చివర్లో వచ్చిన అవకాశాలను వదులుకోవాల్సింది కాదని తెలిపాడు.

IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

మా బౌలింగే బాలేదు..

'కిందపడగానే దెబ్బతగిలి జలక్ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు బానే ఉంది(గాయంపై). మా బ్యాటింగ్ ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు అదరగొట్టారు. ఆరంభంలో పిచ్ నుంచి బౌలర్లకు కాస్త మద్దతు లభించినా.. మా బ్యాటర్లు దానికి తగ్గట్లు అడ్జస్ట్ అయి ఆడారు. మిడిల్ ఓవర్లలో గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్‌ నిర్మించిన తీరు అమోఘం. బెవాన్ జాకబ్స్ కూడా అసాధారణమైన షాట్స్ ఆడాడు. దాంతో మాకు మంచి లక్ష్యం లభించింది.

IND vs NZ Mitchell Santner Blames Powerplay Bowling for New Zealand s 1st T20I Defeat against India

కానీ బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. ఆరంభం నుంచే భారత ఓపెనర్లు మాపై ఒత్తిడి పెంచారు. వాళ్లు ఇలానే దూకుడుగా ఆడుతారని మాకు తెలుసు. పవర్ ప్లేలో మాపై విరుచుకుపడ్డారు.ఈ విషయంలో మేం మెరుగుపడాల్సి ఉంది. కానీ పిచ్ ఎలా ఉందో అర్థమైతే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చని తెలుసు. మిడిల్ ఓవర్లలో వాళ్ల రన్‌రేట్‌ను బాగానే తగ్గించగలిగాం.

ఆ ఇద్దర్ని కట్టడి చేయాలి..

చివరకు మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారింది. ఇరు జట్లను విజయం ఆఖరి వరకు ఊరించింది. ఇరు జట్లలోనూ సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌కు మేం సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఆరంభంలో ఇచ్చినట్లు ఎక్స్‌ట్రాలను ఇవ్వద్దు.

ఫీల్డింగ్ బాగానే చేశాం. ఎందుకంటే ఈ మైదానంలో క్యాచ్‌లు పట్టడం అంత తేలిక కాదు. కానీ చివర్లో వచ్చిన అవకాశాలను అందుకోవడం ముఖ్యం. పవర్ ప్లేలో భారత ఓపెనర్లను నిలవరించాలి. 100 పరుగులు ఇవ్వడానికి బదులు 80 పరుగులకైనా పరిమితం చేయాలి.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

అందుకే తుది జట్టు‌లో రెండు మార్పులు చేశాం: శ్రేయస్ అయ్యర్

Also Read

అందుకే తుది జట్టు‌లో రెండు మార్పులు చేశాం: శ్రేయస్ అయ్యర్

గెలిపించిన నమన్ ధీర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), నమన్ ధీర్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, October 22, 2026, 17:45 [IST]
Other articles published on Oct 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+