Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా డబుల్ సెంచరీకి రూపాయి విలువ లేదు.. ఆ తప్పిదంతోనే ఓటమిపాలయ్యాం: హ్యారీ బ్రూక్

తన ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీకి రూపాయి విలువ కూడా లేదని ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. బౌలింగ్ వైఫల్యంతోనే 430 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని తెలిపాడు. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

దాంతో హ్యారీ బ్యూక్(116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్‌లతో 202) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో రాణించినా ఫాయిదా లేకుండా పోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హ్యారీ బ్రూక్.. శ్రీలంక జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం మాములు విషయం కాదన్నాడు. శ్రీలంక బ్యాటర్ల బలానికి తగ్గట్లు బౌలింగ్ చేయడమే తమ కొంపముంచిందని చెప్పుకొచ్చాడు.

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

రూపాయి విలువ లేదు..

'ఇది ఏ మాత్రం నమ్మశక్యం కానీ మ్యాచ్. రెండు జట్లు అద్భుతంగా ఆడాయి. కాకపోతే దురదృష్టవశాత్తూ శ్రీలంక మా కంటే చాలా బాగా ఆడి పైచేయి సాధించింది. బౌలింగ్‌లో మేం ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. శ్రీలంక బ్యాటర్ల బలానికి తగ్గట్లే బౌలింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నాం.

SL vs ENG Harry Brook Blames Poor Bowling for England s Defeat in High Score Against Sri Lanka

400 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఆశమాషి కాదు. వాళ్లు నిజంగా అద్భుతమైన క్రికెట్ ఆడారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా జరిగిందంటున్నారు. అది నిజంగా గొప్ప విజయం. ఈ క్రెడిట్ పూర్తిగా శ్రీలంకదే. నా డబుల్ సెంచరీ‌కి నా దృష్టిలో రూపాయి విలువ లేదు. రన్స్ రావడం బాగుంది. కానీ జట్టు ఓడిపోయాక ఆ పరుగులతో ఎలాంటి ఉపయోగం లేదు.

మా తప్పిదాలను సరిచేసుకుంటాం..

మేం మా తప్పిదాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ తప్పు చేశామో ఇప్పటికే అర్థమైంది. ముఖ్యంగా ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్‌ చేయాలేకపోయాం. ఫైనల్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లు గెలవడం మాకు కీలకం. కాబట్టి మరీ ఎక్కువగా ఆలోచించకుండా మా బలాన్ని నమ్ముకొని తదుపరి మ్యాచ్‌పై ఫోకస్ పెడుతాం.'అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు.

శ్రీలంక సంచలన విజయం..

రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 429 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యారీ బ్యూక్(116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్‌లతో 202)విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్‌(117 బంతుల్లో) రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. విల్ జాక్స్(66 నాటౌట్), జోరూట్(69), టామ్ బాంటమ్(50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

అనంతరం శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లకు 430 పరుగులు చేసి గెలుపొందింది. అవిష్కా ఫెర్నాండో(83 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97), డసన్ షనక(50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 97) తృటిలో సెంచరీలు చేజార్చుకోగా.. పవన్ రత్నాయకే(106 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 130) సెంచరీతో సత్తా చాటాడు.

Story first published: Friday, October 23, 2026, 10:21 [IST]
Other articles published on Oct 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+