Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశాం: టీమిండియా కోచ్

అనుభవం కోసమే భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నామని టీమిండియా బౌలింగ్ కోచ్ సితాన్షు కోటక్ అన్నాడు. అనుభవానికి ప్రత్యామ్నాయం లేదనే విషయాన్ని ఇంగ్లండ్ పర్యటనలో గ్రహించామని చెప్పాడు.

నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భువనేశ్వర్ కుమార్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చినా పట్టించుకోని సెలెక్టర్లు ఇప్పుడు ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది.

IND vs WI: సీఎస్‌కే‌లోకి వెస్టిండీస్ కెప్టెన్.. డీల్ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ!

IND vs WI: సీఎస్‌కే‌లోకి వెస్టిండీస్ కెప్టెన్.. డీల్ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ!

అనుభవం కోసమే..

వెస్టిండీస్‌తో రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సితాన్షు కోటక్‌ను భువనేశ్వర్ ఎంపిక గురించి ప్రశ్నించగా.. బదులిచ్చాడు. 'యువ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఎంపికవుతున్న మాట నిజమే. కానీ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత్‌కు అనుభవం కలిగిన బౌలర్లు చాలా అవసరం.

అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని ఇంగ్లండ్ పర్యటనలో మేం గ్రహించాం. కీలక సమయాల్లో జట్టును నడిపించడానికి భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ బౌలర్ల మార్గదర్శకత్వం జట్టుకు అవసరం.

Sitanshu Kotak Reveals Bhuvneshwar Kumar s Experience of Making T20I Comeback After IPL Success

2 సీజన్లలో 45 వికెట్లు..

అంతేకాకుండా భువనేశ్వర్ కుమార్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2025, 2026 సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవడంతో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఈ 2 సీజన్లలోనే అతను 45 వికెట్లు పడగొట్టాడు. 2025లో 17, 2026లో 28 వికెట్లు తీసాడు. ఈ అద్బుతమైన ప్రదర్శనతో పాటు అతని అనుభవం జట్టులో అవకాశం కల్పించాయి.'అని సితాన్షు కోటక్ వివరణ ఇచ్చాడు.

IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

మహమ్మద్ షమీ సెలెక్షన్ గురించి ప్రశ్నించగా.. అది తన పరిధిలో లేని విషయమని చెప్పాడు. తాను సెలెక్టర్‌ను కాదని, ఆటగాళ్ల ఎంపిక తన చేతుల్లో లేదన్నాడు. 'నేను సెలెక్టర్‌ను కాను. షమీ సెలెక్షన్ గురించి నేను మాట్లాడలేను. కానీ షమీ దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడుతున్నాడు. జట్టుకు అతని అవసరం ఉంటే.. సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.'అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు. నవంబర్ 2022లో న్యూజిలాండ్‌తో చివరి సారిగా ఆడిన భువనేశ్వర్ కుమార్.. అదే జట్టుతో మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

Story first published: Friday, October 9, 2026, 10:12 [IST]
Other articles published on Oct 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+