IND vs WI: సీఎస్‌కేలోకి వెస్టిండీస్ కెప్టెన్.. డీల్ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ!
వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్‌ను జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు అతనితో సంప్రదింపులు జరిపేందుకు సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. షై హోప్‌తో డీల్ సెట్ చేసేందుకు ధోనీ రాంచీ వేదికగా జరిగే భారత్ వెస్టిండీస్ రెండో టీ20కి హాజరవుతున్నట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది.
మహీ ఇలాకాలోనే ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్‌కే గత రెండు సీజన్లలో తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినా ఆ జట్టు పరిస్థితి మారలేదు. దాంతోనే సంజూ శాంసన్‌కు జోడీగా విధ్వంసకర ఓపెనర్‌ను తీసుకోవాలని సీఎస్‌కే భావిస్తోందట. డేవన్ కాన్వే తర్వాత ఆ జట్టుకు నిలకడైన విదేశీ ఓపెనర్ లేడు. ఆ లోటు వెస్టిండీస్ కెప్టెన్ హై హోప్‌తో భర్తీ చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

ప్రస్తుతం షై హోప్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో మూడో వన్డేలో భారీ శతకం నమోదు చేసిన అతను.. ధోనీతో మాట్లాడటం వల్లే తన బ్యాటింగ్ మెరుగైందని చెప్పాడు. దాంతో అతని కోసం సీఎస్‌కే తరఫున ధోనీ రంగంలోకి దిగాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. నవంబర్ 15లోపు ఐపీఎల్ 2027 మినీ వేలానికి సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. డిసెంబర్‌లో మినీ వేలం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


