మూడు ఓటములకే ఇంతలా విమర్శలా: టీమిండియా బ్యాటింగ్ కోచ్
టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. వర్షంతో తొలి మ్యాచ్ రద్దవ్వగా.. రెండో టీ20లో ఓటమిపాలైంది. దాంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్.. విమర్శలను తప్పుబట్టాడు. కేవలం మూడు పరాజయాలకే ఇంతాలా విమర్శలు చేయడం సరికాదన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ట్రాన్సిషన్ ఫేస్‌లో ఉందని, కొత్త కెప్టెన్, యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని తెలిపాడు.

'గత రెండేళ్లుగా భారత్ టీ20 జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆసియా కప్, ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మకపై టోర్నీల్లో విజేతగా నిలిచింది. ఆ విజయాలు సాధించినప్పుడు ఆకాశానికెత్తిన వారే.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగానే విమర్శలు చేస్తున్నారు. ఇది సరికాదు. ఆటలో గెలుపోటములు సహజం.
భారత జట్టు ప్రస్తుతం పరివర్తనా దశలో ఉంది. జట్టు పునర్నిర్మాణం జరుగుతుంది. జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2028 టోర్నీని దృష్టిలో ఉంచుకుని జట్టును నిర్మిస్తున్నాం. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు కల్పిస్తున్నాం. ఇలాంటి మార్పుల సమయంలో కొన్ని ఓటములు ఎదురవ్వడం సహజం.
హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నాం. టీ20ల్లో పేస్ ఆల్‌రౌండర్‌ను ఆరో బౌలర్‌గా పరిగణిస్తే వారు కీలక పాత్ర పోషిస్తారు. ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నప్పుడు 15 మందికీ ఆడే అవకాశం దక్కకపోవచ్చు. కనీసం జట్టుతో పాటు ఉండటం వల్ల వారు ఆ వాతావరణానికి అలవాటు పడుతారు.’అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో వెనుకంజలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

