Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: వైభవ్ సూర్యవంశీకి గాయం.. నెట్స్‌లో కుప్పకూలిన బుడ్డోడు!(వీడియో)

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టీ20 కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతనికి బంతి బలంగా తాకింది. టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర ద్వివేది(రఘు) వేసిన బంతి వైభవ్ చాలి భాగంలో బలంగా తాకింది. ఈ దెబ్బకు 15 ఏళ్ల వైభవ్ నెట్స్‌లో కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది బుడ్డోడి అసలు సినిమా: అశ్విన్

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది బుడ్డోడి అసలు సినిమా: అశ్విన్

దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేసిన ఈ త్రోడౌన్‌ను అంచనా వేయడంలో వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. బ్యాట్‌ను ముందుగానే స్వింగ్ చేయడంతో మిస్సైన బంతి నేరుగా అతని చాతి భాగంలో బలంగా తాకింది. వైభవ్ సూర్యవంశీకి ప్రథమ చికిత్స చేసిన టీమిండియా ఫిజియోలు.. అతన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకైతే వైభవ్ సూర్యవంశీ గాయం గురించి బీసీసీఐ ఎలాంటి అప్‌‌డేట్ ఇవ్వలేదు. గాయం చిన్నదైతే వైభవ్ మూడో టీ20 ఆడనున్నాడు. పెద్దది అయితే మాత్రం బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

Injury Scare for 15-Year-Old Prodigy Vaibhav Sooryavanshi After Taking Blow to Chest in Net Practice Video

గత శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల 91 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 37 ఏళ్ల సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. అయితే తన అరంగేట్రాన్ని వైభవ్ ఘనంగా చాటుకోలేకపోయాడు. 14 పరుగులే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కానీ క్రీజులో ఉన్నంతసేపు తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ.. వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలి: మాజీ క్రికెటర్

వైభవ్ సూర్యవంశీ.. వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలి: మాజీ క్రికెటర్

ఈ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20ని ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో 1-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 నాటింగ్‌హామ్ వేదికగా రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో ఈ మ్యాచ్ గెలవడం కీలకంగా మారింది.

Story first published: Tuesday, July 7, 2026, 11:30 [IST]
Other articles published on Jul 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+