Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: ర్యాన్ రికెల్టన్‌కు చేదు అనుభవం.. మీ అమ్మ సింగిల్ ఆ? అంటూ ప్లకార్డ్!(వీడియో)

సౌతాఫ్రికా వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా ఓ అభిమాని జుగుప్సాకరమైన ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఆ పకార్డ్‌పై'ర్యాన్ రికెల్టన్ మీ అమ్మ సింగిల్ ఆ?'అనే వ్యాఖ్యలతో పాటు లవ్ సింబల్ ఉంది.

ఆ ప్లకార్డ్‌ను చూపించిన సదరు అభిమాని అంతటితో ఆగకుండా కిస్ చేస్తున్నట్లు సైగలు చేశాడు. ఇది టీవీ కెమెరాల్లో కనిపించగా.. ర్యాన్ రికెల్టన్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కానీ ఆ అభిమానిని ఏం చేయలేక ఆటపై ఫోకస్ పెట్టాడు. జుగుప్సాకరం అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అయితే సదరు అభిమాని ఎవరూ ఏం అనకపోగా.. కామెంటేటర్లు నవ్వుకోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఒక్క దెబ్బతో మ్యాచ్‌ టర్న్.. 99 పరుగులకే ఆలౌట్!

ఒక్క దెబ్బతో మ్యాచ్‌ టర్న్.. 99 పరుగులకే ఆలౌట్!

ఇది జుగుప్సాకరమైన ఘటన అని ఒకరంటే.. ఇదే భారత ఆటగాడి పట్ల జరిగితే సదరు అభిమానిని చితక్కొట్టేవారని మరో అభిమాని అన్నాడు. ఏది ఏమైనా ర్యాన్ రికెల్టన్‌కు ఇది చేదు అనుభవమని, ఇలాంటి అభిమానులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Ryan Rickelton Faces Awkward Moment as Fan Displays Is Your Mom Single Sign during SA vs AUS 3rd Test

ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 330/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్..429 పరుగులకు ఆలౌటైంది. జోష్ ఇంగ్లీస్(135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) సెంచరీతో రాణించగా.. అలెక్స్ క్యారీ(168 బంతుల్లో 7 ఫోర్లతో 80), ఓపెనర్ మాథ్యూ రేన్ షా(139 బంతుల్లో 10 ఫోర్లతో 74) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీయగా.., సిమన్ హర్మర్ నాలుగు వికెట్లు పడగొట్టారు. కగిసో రబాడ, గెరాల్డ్ కోయిట్జీ, వియాన్ మల్డర్ తలో వికెట్ తీసారు.

SA vs AUS: ఓర్నీ.. ఇదేం సెలెబ్రేషన్ రా అయ్యా!(వీడియో)

Also Read

SA vs AUS: ఓర్నీ.. ఇదేం సెలెబ్రేషన్ రా అయ్యా!(వీడియో)

సౌతాఫ్రికా 329 ఆలౌట్..

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(141 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 78), మార్క్యూ అకెర్‌మన్(94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95), డేవిడ్ బెడింగ్‌హమ్(80 బంతుల్లో 7 ఫోర్లతో 50), మార్కో జాన్సెన్(71 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

మిచెల్ స్టార్క్(6/72) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. నాథన్ లయన్(2/71) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌ వుడ్, కూపర్ కనోల్లి చెరో వికెట్ తీసారు.

Story first published: Thursday, October 29, 2026, 18:35 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+