IND vs WI: శుభ్‌మన్ గిల్ ద్విశతకం.. భారత్ ఘన విజయం!
వన్డే ఫార్మాట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకుంది. బుధవారం గౌహతి వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్‌లతో 223 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
రోహిత్ శర్మ(75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) భారీ శతకంతో చెలరేగడంతో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 43.3 ఓవర్లలోనే ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 407 పరుగులు చేసి 39 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29), రుతురాజ్ గైక్వాడ్(37 బంతుల్లో 2 ఫోర్లతో 31 నాటౌట్) పర్వాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్, షమర్ జోసెఫ్ తలో వికెట్ తీసారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక పరుగుల ఛేజింగ్ కాగా.. భారత్‌కు మాత్రం ఆల్‌టైమ్ రికార్డ్ ఛేజింగ్.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్ క్యాంబెల్(68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101), కెప్టెన్ షై హోప్(94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104), అమీర్ జంగూ(77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే వెస్టిండీస్‌కు ఇది రికార్డ్ స్కోర్.
మలుపు తిప్పిన రోహిత్, గిల్..
406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ.. విండీస్ బౌలర్లను ఊచకోత కోసింది. రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి వెస్టిండీస్ మూల్యం చెల్లించుకుంది. ఈ అవకాశాన్ని రోహిత్ సద్వినియోగం చేసుకున్నాడు.
ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 72 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. సెంచరీ అనంతరం శుభ్‌మన్ గిల్ మరింత ధాటిగా ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మ మాత్రం జైడన్ సీల్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 255 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్-గిల్ విధ్వంసంతో 25 ఓవర్లలోనే భారత్ 250 పరుగులు చేయడంతో భారత్ విజయం ఖాయమైంది.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సైతం దూకుడుగా ఆడాడు. కానీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. 117 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


