Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దేశవాళీ క్రికెట్ ఆడాకే పాండ్యా రీఎంట్రీ.. అందుకే ఆ ఇద్దరికీ అవకాశం: శుభ్‌మన్ గిల్

దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే హార్దిక్ పాండ్యా భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడని వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో ముందుగా వన్డే సిరీస్ ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. టీ20లకు బదులు వన్డే సిరీస్ ముందుగా నిర్వహించి ఉంటే తమ పూర్తి జట్టు సిరీస్ మొత్తం ఆడేదని తెలిపాడు. టెస్ట్ సిరీస్ కోసం చివరి రెండు మ్యాచ్‌లకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా సన్నదమైంది. బుధవారం అక్లాండ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ ఐదు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. ఈ తొలి మ్యాచ్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. జట్టు కూర్పు, హార్దిక్ రీఎంట్రీ, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

IND vs NZ వన్డే సిరీస్ టైమింగ్స్‌లో మార్పులు.. ఎలా చూడాలంటే?

IND vs NZ వన్డే సిరీస్ టైమింగ్స్‌లో మార్పులు.. ఎలా చూడాలంటే?

వన్డే సిరీస్ ముందే ఉంటే..

'మాకు వన్డే, టెస్ట్ సిరీస్‌లు రెండు ముఖ్యమైనవే. ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉంది అందుబాటులో ఉంటే వరల్డ్ కప్ కోసం అనుకుంటున్న కాంబినేషన్‌తో ఈ వన్డే సిరీస్‌ ఆడాలనుకున్నా. కానీ అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్ మాకు అత్యంత కీలకం. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు బదులు ముందుగా వన్డేలు ఆడించి ఉంటే బాగుండేది. అప్పుడు ఐదు వన్డేల్లో మా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేవాళ్లం. కానీ వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్‌కు మధ్య సమయం చాలా తక్కువగా ఉండటంతో చివరి రెండు మ్యాచ్‌లకు టెస్ట్ జట్టులో ఉన్న కొంత మంది దూరం కావాల్సి వస్తోంది.

Shubman Gill Says Hardik will play domestic cricket before return and Explains Importance of Tall Bowlers

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసు ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా సిరీస్ విజయం పాయింట్స్ టేబుల్‌లో మరింత ఉత్కంఠగా మార్చింది. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మేం బాగా ఆడి.. ఆ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో రాణిస్తే మా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి.

దేశవాళీ ఆడాకే హార్దిక్ రీఎంట్రీ..

హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆల్‌రౌండర్. అతను కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా జట్టుకు అడ్వాంటేజ్ అవుతుంది. అతనిలాంటి ఆల్‌రౌండ్ స్కిల్క్ చాలా తక్కువ మంది ఆటగాళ్లకు ఉంటాయి. ఐపీఎల్ తర్వాత అతను ఆటకు దూరమవడం దురదృష్టకరం. హార్దిక్‌తో నేను చాలా సార్లు మాట్లాడాను. భారత్-ఏ తరఫున అతను మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. మళ్లీ గాయపడటంతో ఆడలేకపోయాడు. త్వరలోనే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్ ఆడి మళ్లీ భారత జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా.

IND vs NZ: న్యూజిలాండ్‌ ఓపెనర్ తలకు తీవ్ర గాయం.. భారత్‌తో తొలి వన్డేకు దూరం!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్‌ ఓపెనర్ తలకు తీవ్ర గాయం.. భారత్‌తో తొలి వన్డేకు దూరం!

అందుకే ప్రసిధ్, గుర్నూర్ బ్రార్‌కు అవకాశం..

వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో మిడిల్ ఓవర్లలో రాణించే ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం. బంతి పాతబడినప్పుడు, పిచ్ నుంచి సీమ్ లేదా స్వింగ్ లభించనప్పుడు బ్యాటర్లను ఎలా కట్టడి చేయాలనేది కీలకం. పిచ్‌ నుంచి సహకారం లేనప్పుడు పేస్, బౌన్స్‌ ఉన్న బౌలర్లు మాత్రమే బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అలా పేస్, బౌన్స్‌తో పాటు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ.. పరుగులు నియంత్రించగల బౌలర్లను గుర్తించాలనుకుంటున్నాం.

అందుకే గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ వంటి పొడవైన బౌలర్లను పరిశీలిస్తున్నాం. ఫ్లాట్ పిచ్‌లపై 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే వారికంటే హైట్ ఎక్కువ ఉన్న బౌలర్లు బాగా ఉపయోగపడుతారు. నేను చాలా సార్లు మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేశాను. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసే వారిని ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టం. అలాంటి బౌలర్లపై స్వేచ్ఛగా పరుగులు చేయాలంటే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, November 3, 2026, 15:27 [IST]
Other articles published on Nov 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+