ట్యాక్స్ వార్: బీసీసీఐ వార్షిక ఆదాయంలో కోతకు ఐసీసీ సిద్ధం!

హైదరాబాద్: బీసీసీఐ వార్షిక ఆదాయం నుంచి ట్యాక్స్ రూపంలో తమకు రావాల్సిన సొమ్మును తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తోన్న తరుణంలో ముందు జాగ్రత్తలో భాగంగా భారత క్రికెట్ బోర్డు సలహా కోసం ఓ బ్రిటిష్ న్యాయ సంస్థను ఆశ్రయించనుంది.
భారత్‌లో 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై వంద శాతం పన్ను మినహాయింపును ఐసీసీ కోరుతోన్న సంగతి తెలిసిందే. అయితే, 10 శాతం పన్ను కట్టాల్సిందేనంటూ గతంలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన ప్రసారదారు స్టార్‌స్పోర్ట్‌కు ఐటీశాఖ నోటీసులు పంపింది.

పన్ను మినహాయింపు విషయంలో
అయితే పన్ను మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమకు రావాల్సిన సొమ్మును బీసీసీఐ వార్షిక ఆదాయం నుంచి తీసుకుంటామని ఐసీసీ హెచ్చరించింది. ఈ విషయమై బీసీసీఐ లీగల్ టీమ్ ఇప్పటికే బీసీసీఐ పాలకుల కమిటీని సంప్రదించింది.
గ్లోబల్ టీ20 కెనడా లీగ్.. నిరసన తెలిపిన యువరాజ్ సింగ్
https://telugu.mykhel.com/cricket/global-t20-canada-yuvraj-singh-team-refuses-to-play-over-unpaid-022711.html

ఐసీసీకి పన్ను మినహాయింపులు
దీనిపై బీసీసీఐ లీగల్ టీమ్ ఐసీసీకి పన్ను మినహాయింపులు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలను నిర్ధారిస్తూ... 2016 వరల్డ్‌కప్‌కు ముందు, ఐసీసీ ఈవెంట్లకు ఎల్లప్పుడూ పన్ను మినహాయింపులు లభిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ని బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

బీసీసీఐ వార్షిక ఆదాయం నుంచి తీసుకుంటామని
దీంతో ఆ మొత్తాన్ని బీసీసీఐ వార్షిక ఆదాయం నుంచి తీసుకుంటామని ఐసీసీ అంటోంది. ఒకవేళ ఐసీసీ అనుకున్నదే చేస్తే బోర్డు వార్షిక ఆదాయం 405 మిలియన్ డాలర్ల నుంచి 40.5 మిలియన్ డాలర్ల (రూ.286 కోట్లు)ను కోల్పోవాల్సి వస్తోంది.
రెండు సార్లు ఓవర్ల కుదింపు.. భారత్, వెస్టిండీస్ తొలి వన్డే రద్దు
https://telugu.mykhel.com/cricket/india-vs-west-indies-1st-odi-match-abandoned-due-to-rain-wet-outfield-in-guyana-022709.html

2016 వరల్డ్‌కప్‌లో అసలేం జరిగింది?
ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి ఏదైనా టోర్నీలు జరిగినప్పుడు టీవీ ప్రొడక్షన్ పరికరాలను దిగుమతి చేసుకునే విషయంలో ఎక్సైజ్ పన్ను మినహాయింపును కోరుతుంది. స్వదేశీ మ్యాచ్‌లను ప్రసారం చేసే స్టార్‌కు ఇదివరకే ఇక్కడ తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అయితే, 2016లో భారత ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్ సమయంలో బీసీసీఐ ఎందుకు బాధ్యత తీసుకోవాలని, ప్రభ్వుత చట్టాలను తాము మార్చలేమని బోర్డు అధికారులు తేల్చి చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications