Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో చెత్త విషయం: వర్షం కారణంగా తొలి వన్డే రద్దుపై కోహ్లీ

India vs West Indies,1st ODI : Virat Kohli On Rain Interruptions During Match || Oneindia Telugu
 Worst thing in cricket: Virat Kohli on rain interruptions during match

హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగిస్తే చాలా చెత్తగా ఉంటుందని, ఇలా జరగకూడదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం గుయానా వేదికగా జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన తొలి వన్డేను తొలుత అంపైర్లు 43 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంఫైర్లు 34 ఓవర్లకు కుదించారు. అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది.

ఎడతెరిపి లేని వర్షం కురువడంతో

అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి వెస్టిండిస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్(4) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గేల్‌ను కుల్దీప్ ఔట్ చేశాడు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ ఇలా

క్రీజులో ఎవిన్‌ లెవిస్‌(40), షైహోప్‌(6) పరుగులతో ఉన్నారు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ "మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మాటిమాటికి వర్షం అంతరాయం కలిగించడం చిరాకు తెప్పిస్తుంది. ఆట జరిగేటప్పుడు పూర్తిగా వర్షమైనా పడాలి లేదా పూర్తి ఆటైనా కొనసాగాలి" అని అన్నాడు.

ఇలా దోబూచులాడితే

ఇలా దోబూచులాడితే

"ఇలా దోబూచులాడితే ఇబ్బందిగా ఉంటుంది. ఇక. క్రికెట్‌లో అనూహ్య మార్పులొచ్చాయి. అందుకు ఇంగ్లాండ్‌ ప్రదర్శనే నిదర్శం. టీ20ల ప్రభావంతో వన్డేల్లో 400 స్కోర్లు సునాయాసంగా కొట్టగలుగుతున్నారు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి అద్భుతంగా ఆడుతున్నారు" అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

పేస్‌, బౌన్సింగ్‌కు అనుకూలిస్తాయి

"కరీబియన్‌ దీవుల్లో కొన్ని స్టేడియాలు ఆటగాళ్లను పరీక్షిస్తాయి. మరికొన్ని స్టేడియాలు పేస్‌, బౌన్సింగ్‌కు అనుకూలిస్తాయి. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడిన జట్టే విజయాలు సాధిస్తుంది. రాబోయే మ్యాచ్‌ల్లో రెండు జట్లూ పోటాపోటీగా తలపడతాయి" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 9, 2019, 12:25 [IST]
Other articles published on Aug 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+