Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా విజయానికి అదే కారణం.. కలలు నిజమవుతాయి: శ్రేయస్ అయ్యర్

కలలు నిజమవుతాయని, అందుకు తన అరంగేట్ర టీ20 సెంచరీనే సాక్ష్యమని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేయాలని అనుకుంటున్న తరుణంలోనే ఈ కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.

శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్ అందుకున్న అయ్యర్.. మ్యాచ్ అనంతరం విజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా బౌలింగ్ చేయడం తమ విజయానికి బాగా కలిసొచ్చిందన్నాడు. నమన్ ధీర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు.

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

ప్రయాణంతో అలసిపోయాం..

'నిజం చెప్పాలంటే.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత(జపాన్ నుంచి స్వదేశం) నేను ఎక్కడున్నానో కూడా నాకే అర్థం కాలేదు. ప్రతీ రోజు నిద్రలేవగానే ఇలాగే ఉండాలనుకుంటాను. ఏదేమైనా పిచ్, ఇక్కడి వాతావారణానికి త్వరగా అలవాటు పడ్డాను. ముందుగా బౌలింగ్ చేయడం మాకు బాగా కలిసొచ్చింది.

Shreyas Iyer Says Bowling First Helped India Adds Dreams Do Come True After Win Over West Indies in 1st T20I

జపాన్ నుంచి మా ప్రయాణాన్ని సాకుగా చూపించకూడదనుకున్నాం. సాధారణ ఆటగాడిలాగే మైదానంలోకి దిగి ఆడాలనుకున్నాం. భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌ ఎంత రసవత్తరంగా సాగిందో మేం చూశాం. టీ20ల్లో వెస్టిండీస్ ఎంత భయంకరమైనదో మాకు బాగా తెలుసు. అందుకే మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంపైనే ఫోకస్ పెట్టాం. ప్రతీ ఒక్కరు అద్భుతంగా రాణించారు.

కలలు నిజమవుతాయి..

టీ20ల్లో తొలి సెంచరీ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా తొలి టీ20 సెంచరీ గురించి ఆలోచిస్తున్న సమయంలోనే అది నెరవేరింది. కనే కలలు నిజమవుతాయనే మాట నా విషయంలో రుజువైంది. గెలవడంలో వచ్చే మజానే వేరు. డ్రెస్సింగ్ రూమ్‌లో మేం ఎప్పుడూ గెలుపు గురించే మాట్లాడుకుంటాం. మనదైన రోజు ఖచ్చితంగా జట్టును గెలిపించాలి. ఈ రోజు నా రోజు. గత రెండు మ్యాచ్‌ల్లో వేరే బ్యాటర్లు మ్యాచ్‌లను ముగించారు. మొత్తానికి ఇది అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన. ఇదే మైండ్‌సెట్‌తో ఆడితే టీ20ల్లో మేం అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారతాం.

IND vs WI: శ్రేయస్ అయ్యర్ శతకం.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

Also Read

IND vs WI: శ్రేయస్ అయ్యర్ శతకం.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

హాయిగా పడుకుంటాం..

నమన్ ధీర్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అతను అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యం అతని అటిట్యూడ్ అమోఘం. పిచ్ టర్న్ అవుతోందని గ్రహించి అందుకు తగ్గట్లు బౌలింగ్ చేశాడు. అతని ప్రదర్శన ప్రశంసనీయం. అతని అటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఈ రాత్రి హాయిగా నిద్ర పోతాను. నాకు ఇప్పటికే బాగా నిద్ర వస్తోంది. సుదీర్ఘ విమాన ప్రయాణం వల్ల నాతో పాటు అక్షర్ పటేల్ కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. కాబట్టి టీమ్‌లోని వాళ్లందరూ అలాగే అలసిపోయి ఉంటారనడంలో సందేహం లేదు.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, October 7, 2026, 0:05 [IST]
Other articles published on Oct 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+