ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. కనీసం పోరాడే లక్ష్యాన్ని కూడా నమోదు చేయలేకపోయామని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షై హోప్.. చివర్లో దూకుడుగా ఆడకపోవడం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగడం కూడా నష్టం చేసిందని అంగీకరించాడు.
బ్యాటింగే ముంచింది..
'మా ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాం. మా బ్యాటింగ్ చాలా కంగారుగా.. గందరగోళంగా సాగింది. మైదానంలో మంచి ఉన్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలంటే బోర్డుపై మంచి స్కోర్ ఉండాలి. భారత్ వంటి పటిష్టమైన జట్టుతో పోటీ పడటానికి కావాల్సిన పరుగులు మా దగ్గర లేవు. లక్ష్యాన్ని నిర్దేశించి డిఫెండ్ చేయడం కొంచెం కష్టమైన పనే. మా దగ్గర ఇద్దరే స్పిన్నర్లు ఉన్నా.

వాళ్లిద్దరూ చెరో 8 ఓవర్లు వేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఇన్నింగ్స్ చివర్లో రోస్టన్ ఛేజ్ కాస్త వేగంగా ఆడి వేగంగా పరుగులు చేసి ఉంటే బాగుండేది. మ్యాచ్ అయ్యాక ఆలోచిస్తే ఇలాంటివి ఎన్నో అనిపిస్తాయి. ఏదేమైనా నాకు భారత్‌లో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఆడాటాన్ని బాగా ఆస్వాదిస్తాను.'అని షై హోప్ చెప్పుకొచ్చాడు.
భారత్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ షై హోప్(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో నమన్ ధీర్(3/31) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 172 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) అజేయ శతకంతో పాటు ఇషాన్ కిషన్(27 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్) రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల్ హోసెన్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం ఇండోర్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


