Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది అన్యాయమే.. కానీ నాకు మరో ఆప్షన్ లేదు: శ్రేయస్ అయ్యర్

శివమ్ దూబేతో ఆఖరి ఓవర్ వేయించడం అన్యాయమేనని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కానీ తనకు మరో ఆప్షన్ లేదని చెప్పుకొచ్చాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు.

'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. జట్టులో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ గెలుపు కోసం కష్టపడ్డారు. నేను ముందుగా చెప్పినట్లు బుమ్రా జట్టుకు పెద్ద ఆస్తి. అతను అద్భుతమైన ఆరంభంతో మూమెంటమ్ అందించాడు. అర్ష్‌దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేసిన తీరు బాగుంది.

IND vs WI: వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. రిషభ్ పంత్ రీఎంట్రీ!

IND vs WI: వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. రిషభ్ పంత్ రీఎంట్రీ!

అది అన్యాయమే..

ఆఖరి ఓవర్‌ను శివమ్ దూబేకు ఇవ్వడం అన్యాయమే. కానీ నాకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. అతనికి నేరుగా ఆఖరి ఓవర్ ఇవ్వడంతో పిచ్ కండిషన్స్‌ను అంచనా వేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో అతను బాగా వేస్తాడని నేను భావించాను. కానీ పర్వాలేదు. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు.

Shreyas Iyer Reveals Why Shivam Dube Had to Bowl the Final Over Against Afghanistan

అభిషేక్ శర్మ ఆడిన షాట్స్ అసాధారణం. ఇషాన్ కిషన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్స్, డ్రెస్సింగ్ రూమ్‌లో అతను చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు. ప్రస్తుతం తన ఆట ఏంటో తనకు బాగా తెలుసు. ఇది మా జట్టుకు చాలా మంచి పరిణామం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన శివమ్ దూబే.. వరుసగా 6, 6, 1, 4, 4‌లతో 21 పరుగులు సమర్పించుకున్నాడు.

అభిషేక్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/19) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అందుకే వైభవ్ సూర్యవంశీని ఆడించడం లేదు: శ్రేయస్ అయ్యర్

Also Read

అందుకే వైభవ్ సూర్యవంశీని ఆడించడం లేదు: శ్రేయస్ అయ్యర్

అనంతరం భారత్ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 ) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు.

Story first published: Monday, September 14, 2026, 11:34 [IST]
Other articles published on Sep 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+