IND vs WI: వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. రిషభ్ పంత్ రీఎంట్రీ!
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆసియా గేమ్స్ 2026 నేపథ్యంలో ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు.
అతని సారథ్యంలోని భారత టీ20 జట్టు ఆసియా గేమ్స్ ఆడనుండగా.. అదే సమయంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత వన్డే టీమ్ వెస్టిండీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
2023 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించాడు. దాంతో రోహిత్ శర్మ తర్వాత కేఎల్ రాహుల్ భారత వన్డే సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ అతను అందుబాటులో లేకపోవడంతో తిరిగి కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు.

ఈ సిరీస్‌లో ఆడబోయే భారత జట్టు ఎంపికకు సంబంధించిన సమావేశం సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరగనుంది. చీఫ్ సెలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశం అనంతరం జట్టును ప్రకటించనున్నారు. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అతనికి ధ్రువ్ జురెల్ నుంచి పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో అవకాశం దక్కని వికెట్ కీపర్.. ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అక్టోబర్‌లో రంజీ టీమ్ విజేత జమ్మూ కశ్మీర్‌తో రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్ ఆడనుంది.
వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27, 30 అక్టోబర్ 3 తేదీల్లో జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు 5 టీ20ల సిరీస్ జరగనుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు తొలి టీ20లో ఆడే అవకాశం తక్కువగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


